నితిన్.. గోల్డెన్ పాపతో హిట్టొచ్చేనా?
టాలీవుడ్ హీరోల కెరీర్‌లో కొన్నిసార్లు టాలెంట్ కంటే సెంటిమెంటే ఎక్కువ కనిపిస్తుంటుంది.
By: M Prashanth | 25 April 2026 6:00 AM ISTటాలీవుడ్ హీరోల కెరీర్‌లో కొన్నిసార్లు టాలెంట్ కంటే సెంటిమెంటే ఎక్కువ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నితిన్ విషయానికొస్తే, ఆయనకు హిట్ రావాలంటే ఒక పక్కా హీరోయిన్ సెంటిమెంట్ ఉండాలని ఇండస్ట్రీలో ఒక గట్టి నమ్మకం ఉంది. నిత్యా మీనన్ నుంచి రష్మిక మందన్నా వరకు.. నితిన్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాల వెనుక హీరోయిన్ల లక్ ఫ్యాక్టర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే మేజిక్ రిపీట్ చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి అందరి చూపు ‘మిరాయ్’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రితికా నాయక్ వైపు ఉంది. అసలు విషయం ఏంటంటే, నితిన్ హీరోగా సితార బ్యానర్‌లో రాబోతున్న కొత్త సినిమా కోసం రితికా నాయక్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాకపోయినా, ఆమెనే ఫస్ట్ ఛాయిస్ అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మిరాయ్ సినిమాలో రితికా స్క్రీన్ ప్రెజెన్స్, ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.
నితిన్ కెరీర్ ఇప్పుడు కొంత ఒడిదుడుకులో ఉంది కాబట్టి, రితికా లాంటి ఫ్రెష్ ఫేస్ తోడవ్వడం ఖచ్చితంగా ప్లస్ అవుతుందని టీమ్ భావిస్తోంది. రితికా నాయక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ‘గోల్డెన్ లెగ్’లా కనిపిస్తోంది. ఆమె ఇదివరకు నటించిన అశోక వనంలో అర్జున్ కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. చేసిన తక్కువ సినిమాలైనా అమ్మడి అందానికి మంచి క్రేజ్ ఉంది. యూత్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.
గతంలో ‘ఇష్క్’ సినిమాతో నిత్యా మీనన్, ‘భీష్మ’తో రష్మిక నితిన్ మార్కెట్‌ను ఎలాగైతే రిఫ్రెష్ చేశారో, ఇప్పుడు రితికా కూడా అదే రేంజ్‌లో లక్ తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సితార బ్యానర్ అంటేనే ఒక మినిమమ్ గ్యారెంటీ బ్రాండ్ కాబట్టి, ఈ క్రేజీ కాంబోపై ఇప్పుడే అంచనాలు మొదలయ్యాయి. నిజానికి నితిన్ గత కొన్ని సినిమాల ఫలితాలు ఆయన్ని కొంత ఇబ్బందుల్లోకి నెట్టాయి. ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ బాక్సాఫీస్ వద్ద నిలబడకపోవడంతో థియేట్రికల్ వాల్యూ తగ్గింది.
ఇలాంటి టైమ్‌లో మళ్ళీ తన స్ట్రాంగ్ ఏరియా అయిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వైపు ఫోకస్ పడింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. దర్శకుడు ఎవరు, కథా నేపథ్యం ఏంటి అనే వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. హీరోయిన్ గా రితికా నాయక్ పేరు అఫీషియల్ గా అనౌన్స్ అయితే మాత్రం సినిమా బిజినెస్ పరంగా కూడా ఒక మెట్టు ఎక్కుతుందనడంలో సందేహం లేదు. వరుస వైఫల్యాల తర్వాత నితిన్ ఆడుతున్న ఈ సేఫ్ గేమ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఒక ఫ్రెష్ కాంబినేషన్, పక్కా కమర్షియల్ బ్యానర్ తోడైతే నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం పెద్ద కష్టమేమీ కాదు.
