Begin typing your search above and press return to search.

రితికా నాయక్ చార్మ్ అటాక్.. క్లోజ్-అప్ ఫోటోస్‌లో మ్యాజిక్!

క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉన్న ఈ పిక్స్ చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..

By:  Madhu Reddy   |   10 Sept 2026 6:09 PM IST
రితికా నాయక్ చార్మ్ అటాక్.. క్లోజ్-అప్ ఫోటోస్‌లో మ్యాజిక్!
X

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రితికా నాయక్ తాజాగా షేర్ చేసిన అమేజింగ్ క్లోజ్-అప్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ముఖంపై మెరిసే సహజసిద్ధమైన అందం, వేవీ కర్లీ హెయిర్, ముద్దుగా పెదవులు తిప్పుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లతో ఈ భామ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉన్న ఈ పిక్స్ చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..




క్రీమ్ కలర్ హాల్టర్ నెక్‌లో క్యూట్ లుక్ :

ఈ తాజా ఫోటోషూట్ కోసం రితికా నాయక్ క్రీమ్ కలర్ పోల్కా-డాట్ హాల్టర్ నెక్ టాప్‌ను ఎంచుకుంది. ఆకట్టుకునే డిజైన్, మెడ చుట్టూ ఉండే పాటర్న్ హై-నెట్ టై మ్యాచింగ్‌తో ఈ డ్రెస్సింగ్ ఆమెకు పర్ఫెక్ట్ సమ్మర్ అండ్ స్ట్రీట్‌వేర్ వైబ్‌ని తెచ్చిపెట్టింది. దీనికి జతగా చెవులకు బంగారు రంగు హూప్ ఇయర్ రింగ్స్ ధరించి, నాచురల్ గ్లోయింగ్ స్కిన్‌తో ఎంతో ముద్దుగా కనిపిస్తోంది.




ఫ్యాన్స్ ఫిదా.. కామెంట్ల వర్షం:

ఫోటోగ్రాఫర్ శక్తి స్మరన్ కెమెరాలో బంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "గ్రేస్‌ఫుల్", "క్యూటీ", "టీఎఫ్‌ఐ ప్రిన్సెస్" అంటూ ఆమె క్లోజ్-అప్ లుక్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. రాహుల్ చేసిన లైట్ మేకప్, షాడో స్టైలిస్ట్ హెయిర్ డిజైనింగ్ ఆమె నాచురల్ లుక్‌ని మరింత ఎలివేట్ చేశాయని నెటిజన్లు పొగిడేస్తున్నారు.




'అశోక వనం' నుంచి 'మిరాయ్' వరకు ప్రయాణం:

ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2019 విన్నర్‌గా కెరీర్ ప్రారంభించిన రితికా, 'అశోక వనంలో అర్జున కళ్యాణం'చిత్రంలో పసుపులేటి వసుధ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'హాయ్ నాన్న'లో మెరిసింది. అయితే తేజ సజ్జ సరసన నటించిన 'మిరాయ్' చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పి పెద్ద బ్రేక్ ఇచ్చింది. తాజాగా వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.




వరుస ఆఫర్లతో బిజీ బిజీ :

ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్న ఈ ఒడిషా భామ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ సరసన నటిస్తున్న బైలింగువల్ రొమాంటిక్ డ్రామా 'డ్యూయెట్'తో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తోంది.

తన సహజసిద్ధమైన నటన, అమాయకమైన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న రితికా నాయక్, రాబోయే రోజుల్లో పెద్ద ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.