గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మిరాయ్ బ్యూటీ..
తేజ సజ్జా 'మిరాయ్' చిత్రంతో వెండితెరపై మెరుస్తున్న రితికా నాయక్, ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది.
By: Madhu Reddy | 22 April 2026 11:19 PM ISTతేజ సజ్జా 'మిరాయ్' చిత్రంతో వెండితెరపై మెరుస్తున్న రితికా నాయక్, ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది. 'అశోక వనంలో అర్జున కళ్యాణం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ, తన సహజమైన నటన మరియు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు రితికా అందానికి మరియు ఆమె ముఖంలోని అమాయకత్వానికి ఫిదా అయిపోతున్నారు. ఆ విశేషాలు చూద్దాం..
టాలీవుడ్ ఎంట్రీ.. నవ్వుతోనే మాయ:
రితికా నాయక్ ఢిల్లీ నుంచి వచ్చిన అందాల భామ. 2019లో 'ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్' విజేతగా నిలిచిన ఈమె, విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాతో మన ముందుకు వచ్చింది. ఆ సినిమాలో తన పక్కింటి అమ్మాయి లాంటి లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నాని నటించిన 'హాయ్ నాన్న'లో చిన్న పాత్రలో కనిపించినా, తనదైన ముద్ర వేసింది. గత ఏడాది తేజ సజ్జా సరసన 'మిరాయ్' లాంటి భారీ ఫాంటసీ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
సోషల్ మీడియాలో ఫోటో షూట్ రచ్చ:
రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తోంది. పద్ధతైన చీరకట్టులో మెరుస్తూనే, మరోవైపు మోడ్రన్ డ్రెస్‌లలో గ్లామర్ ఒలకబోస్తూ తనలోని వైవిధ్యాన్ని చూపిస్తోంది. ఇక రితికా నవ్వులో ఉండే ఆ సహజమైన క్యూట్‌నెస్ తనకి పెద్ద ప్లస్ పాయింట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ముఖంలోని అమాయకత్వం చూసి యూత్ తెగ మురిసిపోతున్నారు.
ప్రమోషన్స్‌లో క్రేజీ కామెంట్స్:
వెండితెరపై తనకు నచ్చిన హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని సరదాగా చెప్పేసింది. ఇక ఆమె మాటలు, యాటిట్యూడ్ చూస్తుంటే భవిష్యత్తులో ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమనిపిస్తోంది. ఇక 'మిరాయ్' సినిమాకు తో వచ్చిన స్పందన చూస్తుంటే రితికా కెరీర్ మరో మెట్టు ఎక్కినట్లయింది.
స్టార్ హీరోయిన్ మెటీరియల్:
ఏదైనా సినిమాలో హీరోయిన్ కేవలం అందంగా ఉంటే సరిపోదు, ఆ పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్స్ పలకాలి. రితికా నాయక్ విషయంలో అది అక్షరాలా నిజమవుతోంది. సంప్రదాయక రూపమైనా, ట్రెండీ లుక్ అయినా తను ఎంతో ఈజ్‌తో క్యారీ చేస్తోంది. ఇక ఇప్పుడున్న హీరోయిన్ల పోటీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో రితికా సక్సెస్ అయిందనే చెప్పాలి. మరి ఈ 'మిరాయ్' భామ మున్ముందు ఇంకెన్ని క్రేజీ ప్రాజెక్టులతో మనల్ని అలరిస్తుందో వేచి చూడాల్సిందే!
