టాలీవుడ్ గోల్డెన్ లెగ్.. నెక్స్ట్ ఏంటంటే..
ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా తెలివిగా అడుగులు వేయడం రితికా స్పెషాలిటీ. స్క్రీన్ మీద క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉండేలా చూసుకుంటుంది.
By: M Prashanth | 10 Aug 2026 1:31 PM ISTటాలీవుడ్ లో ఇప్పుడు రితికా నాయక్ పేరు ఓ బ్రాండ్ లా మారిపోయింది. ఈమె ఏ సినిమా చేస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ బలంగా పెరుగుతోంది. అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత హాయ్ నాన్న, మిరాయ్ తో హిట్స్ కొట్టింది. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీ అంతా ఆమెను లక్కీ చార్మ్ గా భావిస్తోంది. వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ఒప్పుకోకుండా చాలా తెలివిగా అడుగులు వేయడం రితికా స్పెషాలిటీ. స్క్రీన్ మీద క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉండేలా చూసుకుంటుంది. క్వాలిటీకి పక్కా అంటూ కెరీర్ ని ప్లాన్డ్ గా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న డ్యూయెట్ ప్రాజెక్ట్ తో ఆసక్తి రేపుతోంది. ఇలా సెలెక్టివ్ గా వెళ్లడం వల్లే సక్సెస్ ట్రాక్ పక్కాగా కొనసాగిస్తోంది.
ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ నుంచి రానున్న ప్రాజెక్ట్ మీద ఫోకస్ పడుతోంది. టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ తో కలిసి పవర్ పేట అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చాలా గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ కెరీర్ లోనే ఇది ఒక హై బడ్జెట్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. దీంతో మరో సాలిడ్ హిట్ గ్యారెంటీ అని సినీ జనాలు అనుకుంటున్నారు.
ఈ పవర్ పేట సినిమాను దర్శకుడు కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. కంటెంట్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడంలో ఇతనికి మంచి పేరు ఉంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ కు భారీ బడ్జెట్ తోడవడంతో ఈ సినిమాపై మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ మూవీలో రితికా నాయక్ క్యారెక్టర్ కి చాలా మంచి స్కోప్ ఉందని, ఆమె యాక్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని తెలుస్తోంది. మంచి రోల్స్ చూసుకునే రితికా ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుందంటే కంటెంట్ లో స్టఫ్ గట్టిగానే ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ కి లక్కీ చార్మ్ లా మారిన ఈ భామ లక్, ఈసారి సందీప్ కిషన్ కు కూడా బాగా కలిసి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నా, రితికా ఇంకాస్త స్పీడ్ పెంచితే బాగుంటుందని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. ట్రెండ్స్ వేగంగా మారుతున్న ఈ టైమ్ లో, ఆఫర్స్ వచ్చినప్పుడే ఫాస్ట్ గా సినిమాలు సైన్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఏదేమైనా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, తనదైన స్టైల్ లో హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గా ఎదిగిపోయింది. ఇక పవర్ పేట సినిమాతో ఈ సక్సెస్ స్ట్రీక్ ఇంకా ఈ స్థాయికి వెళుతుందో చూడాలి.
