Begin typing your search above and press return to search.

ఈ హీరోయిన్ అడుగుపెడితే చాలు.. సినిమా హిట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు వరుస విజయాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా..చేసిన సినిమాలు విజయాలు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంటారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 4:01 PM IST
ఈ హీరోయిన్ అడుగుపెడితే చాలు.. సినిమా హిట్ అవ్వాల్సిందే..!
X

టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్లు వరుస విజయాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. మొదట్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా..చేసిన సినిమాలు విజయాలు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంటారు. ఇప్పుడు అలాంటి గుర్తింపునే సొంతం చేసుకుంటోంది యంగ్ హీరోయిన్ రితికా నాయక్. ఆమె నటించిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ అమ్మడిని లక్కీ హీరోయిన్ అంటూ ట్యాగ్ లైన్..కూడా వచేసింది.




రితికా నాయక్ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో రితికాకు టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత కూడా ఆమె తన కెరీర్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళింది.

ఇక రితికా నాయక్ నటించిన మిరాయ్ సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో ఆమెకు మరింత మంది ప్రేక్షకులు దగ్గరయ్యారు. హాయ్ నాన్న సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర చేసి ఆకట్టుకుంది. మొత్తానికి ఈ హీరోయిన్స్ సినిమాలో ఉంటే చాలా బిట్ అనే లాగా అనిపించింది.

ఇప్పుడు రితికా నాయక్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. పవర్‌పేట సినిమా నుంచి విడుదలైన ప్రత్యేక వీడియోలో ఆమె అందం, గ్లామర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియోలో ఆమె లుక్ చూసిన కొందరు అభిమానులు టాలీవుడ్‌లో ఈ అమ్మడు మరింత బిజీ కావడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎప్పుడు కనిపించనంత అందంగా ఈ హీరోయిన్ ఈ వీడియోలో.. కనిపించింది.

సాధారణంగా కొత్త హీరోయిన్లకు వరుసగా విజయాలు రావడం అంత సులభం కాదు. మంచి కథలు ఎంచుకోవడం, నటనతో మెప్పించడం, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయడం చాలా ముఖ్యం. రితికా నాయక్ విషయంలోనూ ఇవే అంశాలు ఆమె కెరీర్‌కు ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు.

నిన్న మొన్నటిదాకా సరైన స్క్రిప్టులు ఎంచుకొని ఈ హీరోయిన్ అడుగుపెడితే చాలు సూపర్ హిట్ అనిపించుకుంటూ వచ్చిన ఈ హీరోయిన్.. ఇప్పుడు పవర్ పేట వీడియోలో తన అందంతో మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.