ఆ హీరోయిన్ నా గర్ల్ క్రష్
రితికా నాయక్ తాజాగా చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 9 Aug 2026 8:00 AM ISTరితికా నాయక్ తాజాగా చేసిన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తనకు హీరోయిన్ సాయి పల్లవి పై గర్ల్ క్రష్ ఉందని రితికా చెప్పడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా నటీనటులు తమ అభిమాన నటులు లేదా ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడటం సహజమే. అయితే ఒక హీరోయిన్ మరో హీరోయిన్ వ్యక్తిత్వాన్ని, కెరీర్ ఎంపికలను, యాక్టింగ్‌ను ఈ స్థాయిలో ప్రశంసించడం ప్రత్యేకంగా నిలిచింది.
తాజా ఇంటర్వ్యూలో రితికా తనకు అత్యంత ఇష్టమైన లవ్ మూవీ ఫిదా అని వెల్లడించింది. ఆ సినిమాను రీసెంట్ గానే చూశానని, అందులో సాయి పల్లవి యాక్టింగ్ తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పింది. అంతేకాదు, సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెపై తనకు గర్ల్ క్రష్ ఉందని కూడా రితికా పేర్కొంది. రితికా మాటల్లో సాయి పల్లవి కేవలం మంచి నటి మాత్రమే కాదు, ఒక వ్యక్తిత్వం. ఆమె చాలా హంబుల్, చాలా ఛార్మింగ్ అని, ఆమె ఉండే విధానం తనకు చాలా నచ్చుతుందని, ఆమెను చూసినప్పుడల్లా తనలా ఉండాలనిపిస్తుందంటూ రితికా చెప్పిన మాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి సినిమాల ఎంపిక, పాత్రలను ఎంచుకునే విధానం, వాటిలో పూర్తిగా లీనమై నటించే తీరు తనకు ఎంతో స్పూర్తినిస్తుందని రితికా వివరించింది.
ఈ కామెంట్స్ చూస్తే రితికా సాయి పల్లవిని కేవలం అభిమానించడమే కాకుండా, ఒక ఆర్టిస్టుగా ఆమె ప్రయాణాన్ని ఆదర్శంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్టార్‌డమ్ కంటే యాక్టింగ్ కు, కమర్షియల్ ఇమేజ్ కంటే పాత్రల క్వాలిటీకి ప్రాధాన్యం ఇచ్చే సాయి పల్లవి కెరీర్ ఎంతో మంది కొత్త హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రితికా కామెంట్స్ కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాయి.
కాగా రితికా నాయక్ తాజాగా వరుణ్ తేజ్ సరసన నటించిన కొరియన్ కనకరాజు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్లలో భాగంగానే ఆమె సాయి పల్లవిపై తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో పోటీ కంటే పరస్పర గౌరవం, ఇన్సిపిరేషన్ కూడా ఉంటాయని రితికా కామెంట్స్ మరోసారి చాటి చెప్పాయి. ముఖ్యంగా గర్ల్ క్రష్ అనే పదాన్ని ఉపయోగిస్తూ సాయి పల్లవి బిహేవియర్, యాక్టింగ్, కెరీర్ డెసిషన్స్ పై రితికా వ్యక్తం చేసిన అభిమానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
