Begin typing your search above and press return to search.

'మిరాయ్‌' పాప డ్రీమ్ స్కెచ్ అదిరింది!

దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీపిక ప‌దుకునే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది.

By:  Ravindar Gorantla   |   10 March 2026 6:00 PM IST
మిరాయ్‌ పాప డ్రీమ్ స్కెచ్ అదిరింది!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ `పుష్ప 2 `త‌రువాత భారీ స్థాయికి చేరుకుంది. ప్ర‌భాస్ త‌రువాత ఈ రేసులోకి సోలో హీరోగా క్కేజీ స్టార్‌లు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ వ‌చ్చి చేర‌తార‌ని అంతా ఊహిస్తే ఆ ఇద్ద‌రినీ ఓవ‌ర్ టేక్ చేసి సెకండ్ ప్లేస్‌ని బ‌న్నీ ఆక్ర‌మించేశాడు. పాన్ ఇండియా స్టార్‌ల‌లో రెండ‌వ స్థానానికి `పుష్ప‌2`తో చేరుకున్న బ‌న్నీ ఇప్పుడు ఆ స్థాయికి మించిన సినిమాల్లో న‌టిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. కెరీర్‌ని స‌రికొత్త‌గా ప్లాన్ చేసుకుంటూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ష‌న్‌లో స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ నిర్మిస్తున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో న‌టిస్తున్నాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీపిక ప‌దుకునే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే నెల గ్లింప్స్‌ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు బ‌న్నీ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం తెలిసిందే. AA23ని లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో, AA24ని సందీప్‌రెడ్డి వంగ‌తో ప్లాన్ చేసుకున్న బ‌న్నీ AA25ని మాత్రం మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు బ‌సిల్ జోసెఫ్‌తో చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే సాన్ ఇండియా స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకుని హాట్ టాపిక్‌గా మారిన ఐకాన్ స్టార్‌పై క‌ర్చీఫ్ వేసేస్తోంది మిరాయ్ పాప రితికా నాయ‌క్‌. ఢిల్లీలోని శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ కాలేజ్ ఫ‌ర్ ఉమెన్ లో హ‌య్య‌ర్ ఎడ్యూకేష‌న్ పూర్తి చేసి ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 12 సీజ‌న్ విజేత‌గా నిలిచింది. ఆ త‌రువాత సినిమాల్లో అరంగేట్రానికి చాలా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల చుట్టూ తిరిగి ఆడిష‌న్‌లలో పాల్గొంది. ఫైన‌ల్‌గా 2022లో మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన `అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.

ఫ‌స్ట్ మూవీతో బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ అవార్డుని ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తేజ స‌జ్జ `మిరాయ్‌`లో కొంచెం బొద్దుగా మారి విభ క్యారెక్ట‌ర్‌లో హీరోకు క‌ర్త‌వ్య‌బోధ చేసి త‌న ల‌క్ష్యాన్ని గుర్తు చేసే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా మిథున్ వ‌ర‌ద‌రాజ కృష్ణ‌న‌న్ రూపొందిస్తున్న ద్విభాషా చిత్రం `డ్యుయెట్‌`తో పాటు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `కొరియ‌న్ క‌న‌క‌రాజు`లో న‌టిస్తోంది. ఇందులో `కొరియ‌న్ క‌న‌క‌రాజు` ఈ స‌మ్మ‌ర్‌కు రిలీజ్‌కు రెడీ అవుతోంది.

రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్న రితికా నాయ‌క్‌కు ఓ డ్రీమ్ ఉంద‌ట‌. అదేంటంటే ఎప్ప‌టికైనా ఐకాన్ స్టార్‌ సినిమాలో న‌టించాల‌న్న‌దే త‌న డ్రీమ్ అంట‌. అల్లు అర్జున్ సినిమాలో చిన్న రోల్ అయినా స‌రే న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెబుతోంది. మ‌రి బ‌న్నీ.. రితిక డ్రీమ్‌ని గుర్తించి త‌న సినిమాల్లో అవ‌కాశం క‌ల్పిస్తాడా? అన్న‌ది వేచి చూడాల్సిందే.