బిగ్ బాస్ 9.. రీతూ డబల్ గేమ్ బయట పడిందిగా..?
ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య గొడవలైతే బిగ్ బాస్ ఆడియన్స్ ని ఇరిటేట్ చేశాయి. ఐతే డీమాన్ పవన్ ఆటలో వెనకపడటానికి మెయిన్ రీజన్ రీతూనే అనే చెబుతారు.
By: Ramesh Boddu | 8 Dec 2025 11:22 AM ISTబిగ్ బాస్ సీజన్ 9లో రీతూ డబల్ గేం ఫైనల్ గా బయట పడింది. ఆమె హౌస్ లో ఉన్నన్నాళ్లు డీమాన్ పవన్ కి క్లోజ్ గా ఉంది. హౌస్ లో ఉన్న వాళ్లంతా ఒక దగ్గర ఉంటే రీతు ఎక్కడ ఉంటే డీమాన్ పవన్, డీమాన్ ఎక్కడ ఉంటే రీతు అక్కడ అన్నట్టు ఉంది. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య గొడవలైతే బిగ్ బాస్ ఆడియన్స్ ని ఇరిటేట్ చేశాయి. ఐతే డీమాన్ పవన్ ఆటలో వెనకపడటానికి మెయిన్ రీజన్ రీతూనే అనే చెబుతారు. చాలాసార్లు అది ప్రూవ్ అయ్యింది.
హౌస్ లో ఉన్నన్నాళ్లు డీమాన్ పవన్ కి..
రీతు ఎలిమినేషన్ డీమాన్ పవన్ ని ఎమోషనల్ అయ్యేలా చేసినా సరే ఈ వారం రోజులు అతని ఆట తనొక్కడే ఆడుకునే ఛాన్స్ వచ్చినందుకు ఆడియన్స్ సంతోషంగా ఉన్నారు. ఐతే రీతూ హౌస్ లో ఉన్నన్నాళ్లు డీమాన్ పవన్ కి సపోర్ట్ చేసి అతనే గెలవాలి అన్నట్టు ఉంది. ఐతే ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వచ్చిన రీతూ హౌస్ లో ఉన్న ఏడుగురికి నెంబర్ ఆర్డర్స్ ఇవ్వమంటే. భరణికి 7, సుమన్ కి 6, సంజన 5, కళ్యాణ్ 4 ఇచ్చింది ఆ తర్వాత డీమాన్ పవన్ కి 1 ఇచ్చి 2, 3 నెంబర్స్ ని తనూజ, ఇమ్మాన్యుయెల్ ఫోటోల మధ్యలో పెట్టింది. అంటే ఈ ఇద్దరికి 2, 3 స్థానాల్లో ఎవరైనా ఉండొచ్చని అలా రీతూ చెప్పింది.
ఐతే మళ్లీ ఏమనుకుందో ఏమో కానీ కళ్యాణ్ కి పెట్టిన 4 ని తీసి తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్యలో పెట్టి కళ్యాణ్ కి కూడా బాగా ఆడాడని అన్నది. అంటే డీమాన్ పవన్ తో కళ్యాణ్ కి కూడా ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్టే అన్నమాట. హౌస్ లో కూడా రీతూ మొదటి రెండు వారాలు కళ్యాణ్ కి క్లోజ్ గా ఉంది. కానీ ఆ తర్వాత డీమాన్ పవన్ కి క్లోజ్ అయ్యింది. ఐతే డీమాన్ పవన్ ఒక్కడే గెలవాలని రీతూ అనుకుంటే ఫ్రెండ్ కదా ఈమాత్రం ఉండాలని అనుకునే వారు.. కానీ రీతూ చివర్లో కళ్యాణ్ ని కూడా మెన్షన్ చేయడంతో ఆమె డబల్ గేం బయట పడింది.
కళ్యాణ్ కి గెలిచే ఛాన్స్..
ఎక్కడ కళ్యాణ్ కి గెలిచే ఛాన్స్ లు ఉన్నాయో అనుకుంటూ రీతూ డీమాన్ తో పాటు కళ్యాణ్ కి తన సపోర్ట్ ఉందని అనిపించేలా లాస్ట్ మినిట్ లో అలా చేసింది. ఐతే ఆల్రెడీ రీతూ ఆటని డీకోడ్ చేసిన ఆడియన్స్ కనిపెట్టారు. అసలైతే రీతు 2 వారాల ముందు తనూజ కెప్టెన్సీ టైం లో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యింది. లేకపోతే ఆ వారమే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేదని ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 9లో రీతూ ఆటలో ఎక్కువగా డీమాన్ తప్ప మరేమి లేదని ఫైనల్ కామెంట్ వినిపిస్తుంది.
