కంటెస్టెంట్ల కంటే హోస్ట్ గురించే ఎక్కువ డిస్కషన్!
రియాలిటీ షోలంటే సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ఎమోషనల్ డ్రామా, అనూహ్య ట్విస్టులే మెయిన్ డిస్కషన్ గా మారుతాయి.
By: Sravani Lakshmi Srungarapu | 9 July 2026 6:00 PM ISTరియాలిటీ షోలంటే సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, ఎమోషనల్ డ్రామా, అనూహ్య ట్విస్టులే మెయిన్ డిస్కషన్ గా మారుతాయి. కానీ ప్రస్తుతం ప్రసారమవుతున్న లాక్ అప్ సీజన్2 విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. షోలో పాల్గొంటున్న సెలబ్రిటీల కంటే హోస్ట్ రితేష్ దేశ్‌ముఖ్ హోస్టింగ్ స్టైలే సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్కషన్ కు వస్తోంది. కొత్త సీజన్‌లో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్‌లను పరిశీలిస్తే, రితేష్ రెగ్యులర్ రియాలిటీ షో హోస్ట్‌లా కంటెస్టెంట్లపై తీర్పులు చెప్పే ప్రయత్నం చేయకుండా, వారి సిట్యుయేషన్ ను అర్థం చేసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎవరి ఎమోషన్స్ ను అయినా శ్రద్ధగా వినడం, అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితులను కూల్ గా హ్యాండిల్ చేయడం ఆయన హోస్టింగ్‌లో కనిపిస్తున్న ప్రత్యేకతగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా మొదలైంది. ఇండియన్ రియాలిటీ షోల విషయానికొస్తే సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మోస్ట్ పవర్‌ఫుల్ హోస్ట్‌గా గుర్తింపు పొందుతున్నారనే అభిప్రాయం కొనసాగుతూనే ఉంది. అయితే అదే సమయంలో కొత్త తరం ఆడియన్స్ కు దగ్గరయ్యే హోస్టింగ్ శైలిని రితేష్ చూపిస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. హోస్టింగ్ పరంగా రితేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం అందరినీ అలరిస్తుంది.
రితేష్ హోస్టింగ్‌లో ఎక్కువగా ప్రశంసలు అందుకుంటున్న అంశం ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడు సరదాగా మాట్లాడాలి, ఎప్పుడు సీరియస్‌గా రియాక్ట్ అవాలి? ఎప్పుడు కేవలం వినడమే సరిపోతుందో ఆయనకు మంచి అవగాహన ఉందని ఆడియన్స్ అంటున్నారు. అందుకే ఆయన కంటెస్టెంట్లతో హోస్ట్‌గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.
ఇక ఓటీటీ రియాలిటీ షోల ఫ్యూచర్ హోస్టుల లిస్ట్ లో కూడా రితేష్ పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం. ఓటీటీ ఆడియెన్స్‌కు కనెక్టయ్యే హోస్ట్‌గా ఆయన నిలిచే అవకాశాలున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. రితేష్ పనితీరును ప్రశంసించినప్పటికీ, భారీ రియాలిటీ షోలను తనదైన స్టైల్‌తో ముందుకు నడిపించే విషయంలో సల్మాన్ ఖాన్‌కు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉందని మరో వర్గం స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, లాక్ అప్ 2లో కంటెస్టెంట్ల మధ్య జరిగే పరిణామాల కంటే హోస్ట్ గురించే ఎక్కువ చర్చ జరగడం ఈ సీజన్‌లోని అతిపెద్ద అనూహ్య పరిణామంగా చెప్పవచ్చు. ఒక రియాలిటీ షోలో హోస్ట్ కూడా మెయిన్ ఎట్రాక్షన్ గా మారగలడని రితేష్ దేశ్‌ముఖ్ మరోసారి నిరూపిస్తున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
