Begin typing your search above and press return to search.

రాజా శివాజీకి ముందు రిస్క్ చేస్తున్న రితేష్

కొన్ని క‌థ‌ల‌ను ఎంచుకుని వాటిని చేయ‌డం వ‌ల్ల న‌టీన‌టుల‌కు లేని పోని త‌ల‌నొప్పులు, కొత్త వివాదాలు త‌లెత్తుతూ ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Nov 2025 12:00 AM IST
రాజా శివాజీకి ముందు రిస్క్ చేస్తున్న రితేష్
X

కొన్ని క‌థ‌ల‌ను ఎంచుకుని వాటిని చేయ‌డం వ‌ల్ల న‌టీన‌టుల‌కు లేని పోని త‌ల‌నొప్పులు, కొత్త వివాదాలు త‌లెత్తుతూ ఉంటాయి. అయితే దానికి కార‌ణాలు అన్నిసార్లూ ఒకటే అవాల్సిన ప‌న్లేదు. కొన్నిసార్లు వారు సెలెక్ట్ చేసుకునే క‌థ‌ల వ‌ల్ల వారికి ఇబ్బందులు ఎదురైతే, మ‌రికొన్ని సార్లు వారి త‌ర్వాత లైనప్ వ‌ల్ల కూడా ఆ మూవీని ఆడియ‌న్స్ యాక్సెప్ట్ చేయ‌లేక‌పోతారు.

రాజా శివాజీని చేస్తున్న రితేష్

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ కు కూడా ఇలాంటి స‌మ‌స్యే వ‌చ్చింది. రితేష్ దేశ్‌ముఖ్, ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్ గా రాజా శివాజీని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న కెరీర్లోనే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క సినిమాగా రాజా శివాజీ నిలుస్తుంద‌ని భావిస్తున్న రితేష్ నుంచి ఆ సినిమా కంటే ముందుగా మ‌స్తీ4 రానుంది. రాజా శివాజీకి ముందు రితేష్ ఇలాంటి అడ‌ల్ట్ కామెడీ క్యారెక్ట‌ర్ ను చేయ‌డం చూసి చాలామంది నిరాశ చెందుతున్నారు.

రీసెంట్ గా రిలీజైన మ‌స్తీ4 ట్రైల‌ర్

రీసెంట్ గా మ‌స్తీ4 ట్రైల‌ర్ రిలీజ‌వ‌గా, దాన్ని చూసిన ఆడియ‌న్స్ భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌స్తీ4 ట్రైల‌ర్ విలువ‌లు లేకుండా, సెక్సువ‌ల్ రిఫ‌రెన్సులపై ఆధార‌ప‌డి ఉంద‌ని, మేక‌ర్స్ ఇంకా 2000 సంవ‌త్స‌రంలోనే ఉన్నార‌ని ఆడియ‌న్స్ విమ‌ర్శిస్తున్నారు. మ‌స్తీ4 ట్రైల‌ర్ లో రితేష్ దేశ్‌ముఖ్ త‌న కామెడీతో, యాక్టింగ్ తో మెప్పించారు.

మ‌స్తీ4 ట్రైల‌ర్ పై భిన్నాభిప్రాయాలు

అయిన‌ప్ప‌టికీ శివాజీ మ‌హారాజ్ లాంటి క్యారెక్ట‌ర్ ను చేస్తూ, ఆ సినిమా కంటే ముందు ఇలాంటి క్యారెక్ట‌ర్ లో క‌నిపించ‌డానికి రితేష్ ఎలా ఒప్పుకున్నార‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. రాజ శివాజీ లాంటి గొప్ప సినిమా చేస్తున్న‌ప్పుడు రితేష్ మ‌స్తీ4ను వ‌దిలేయాల్సింద‌ని కొంద‌రంటుంటే, యాక్ట‌ర్ అన్న త‌ర్వాత అన్ని ర‌కాల పాత్ర‌లు చేయాల‌ని అప్పుడే న‌టుడిగా త‌ర్వాతి స్థాయికి వెళ్ల‌గ‌రని ఇంకొంద‌రంటున్నారు. ఇలాంటి మిక్డ్స్ రెస్పాన్స్ మ‌ధ్య రాజా శివాజీకి ముందు రితేష్ ఈ సినిమా చేయ‌డం దానిపై కాస్త ఎఫెక్ట్ చూపే అవ‌కాశం లేక‌పోలేదు. న‌వంబ‌ర్ 21న రిలీజ్ కానున్న మ‌స్తీ4 బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుందా? మ‌స్తీ4 ఎఫెక్ట్ రాజా శివాజీపై ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఏదేమైనా రితేష్ ఈ విష‌యంలో కాస్త రిస్క్ చేసిన‌ట్టే అని చెప్పాలి.