స్నాక్స్ ఇంట్లోనే రెడీ చేసుకుని ఓటీటీలో వీక్షణ!
గత నాలుగైదేళ్ల కాలంగా ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా భారీ విజయం సాధిస్తే తప్ప సగటు ప్రేక్షకుడు సినిమాకెళ్లడం లేదు.
By: Srikanth Kontham | 30 Dec 2025 8:15 AM ISTనేడు సినిమా సగటు ప్రేక్షకుడికి ఎంత భారంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. టికెట్ ధరలు పెరగడం..పాప్ కార్న్ ధరలు ఆకాశాన్నంటడంతో థియేటర్ కు వెళ్లడానికి ప్రేక్షకులు ఎంత మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కుటుంబమంతా ఇంట్లోనూ కూర్చుని చూసే వెసులు బాటు అందుబాలో ఉండటంతో? ధియేటర్ ఆక్యుపెన్సీ అన్నది భారీగా పడిపోయింది. గత నాలుగైదేళ్ల కాలంగా ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా భారీ విజయం సాధిస్తే తప్ప సగటు ప్రేక్షకుడు సినిమాకెళ్లడం లేదు.
మరి దీనిపై దిద్దుబాటు చర్యలేమైనా ఉన్నాయా? అంటే అదెక్కడా కనిపించలేదు. చివరికి ఈ వ్యవహారం ఏ స్థాయికి చేరిందంటే? కోర్టులు కూడా ఇందులో జోక్యం చేసుకుంటున్నాయి. ఇటీవలే తెలంగాణ హైకోర్టు టికెట్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి టికెట్ ధరలు పెంచమని తమ వద్దకు రావొద్దంటూ నిర్మొహమాటగా చెప్పేసారు. మరి దీనికి సంబంధించి చాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుం టుంది? అన్నది చూడాలి. ఇటీవలే పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ప్రభుత్వ అధికారులతో భేటీ అవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని పరిశ్రమ ఎదురుచూస్తోంది. మరి ఇలాంటి పరిస్థితి ఇక్కడేనా? అంటే దేశమంతా ఇదే పరిస్థితి. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా దీనిపై సీరియస్ గానే ఆలోచన చేస్తుంది. తాజాగా ఈ అంశంపై నటి మాధురి దీక్షిత్ కూడా స్పందించారు. పెరిగిన ధరల కారణంగా ఏ సినిమాకు వెళ్లాలి? ఏ సినిమా వాయిదా వేయాలి? అని వాళ్లు ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉదయం వెళ్లిన ఉద్యోగులు సాయంత్రం 9కి ఇంటికి చేరుకుటారు.
వారెంత మాత్రం థియేటర్ కి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదన్నారు. వారాంతంలో ఒక సెలవు దొరుకుతుంది. ఆసెలవు రోజు కూడా రెండున్నర గంటలు థియేటర్లో గడపడం దేనికి? ఓటీటీ ఉంది కదా? అని ఆలోచిస్తున్నారు. అలా చేస్తే ఇంట్లోనే స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. పాప్ కార్న్, సమోసా తాయారు చేసుకుంటే స్నాక్స్ ఖర్చు తగ్గు తుంది. కుటుంబమంతా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు అనుకుంటారు. అందులో తప్పేమి లేదు. ఈ కారణంగా సినిమా అంధకారంలో పడిపోదు. కానీ సినిమా భవిష్యత్ కు మాత్రం ఇది ముప్పే అని చెప్పగలనన్నారు.
పరిశ్రమ సహా రిలీజ్ సమయంలో యాజమాన్యాలు కొన్ని విషయాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. ప్రేక్షకుల్ని థియేటర్ కు రప్పించే ప్రయత్నాలు చేయకుండా? ఉంటే మాత్రం సినిమాకు భవిష్యత్ కష్టమన్నారు.
