రిషబ్ శెట్టి టాలీవుడ్ హీరో ఎవరు?
కన్నడ నటుడు కం డైరెక్టర్ రిషబ్ శెట్టి `కాంతార చాప్టర్ 1` విజయంతో మరోసారి సంచలనమయ్యాడు.
By: Srikanth Kontham | 5 Oct 2025 2:34 PM ISTకన్నడ నటుడు కం డైరెక్టర్ రిషబ్ శెట్టి `కాంతార చాప్టర్ 1` విజయంతో మరోసారి సంచలనమయ్యాడు. డైరెక్టర్ గా..నటుడిగా మరోసారి వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. దీంతో రిషబ్ శెట్టి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూడాల్సిన పనిలేదు. స్టార్ లీగ్ లో చేరినట్లే. ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. తెలుగులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరక్కుతున్ను `జై హనమాన్` లో నటిస్తున్నాడు. ఇది గాక బాలీవుడ్ లోనూ ఎంటర్ అవుతున్నాడు. ఇలా రిషబ్ శెట్టి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.
ఇదంతా సరే రిషబ్ శెట్టి తెలుగు హీరోను డైరెక్ట్ చేయాల్సి వస్తే ముందుగా ఏ హీరోతో ఛాన్స్ తీసుకుంటాడు? అన్న చర్చ అప్పుడే ఫిలిం సర్కిల్స్ లో మొదలైంది. రిషబ్ ట్యాలెంట్ చూసి ఏ హీరో అయినా డేట్లు ఇస్తాడు. అందులో
ఎలాంటి డౌట్ లేదు. చరణ్, బన్నీ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ ఇలా స్టార్ హీరోలంతా రిషబ్ సరైన స్టోరీతో అప్రోచ్ అయితే ఇనిస్టెంట్ గా డేట్టు ఇచ్చే అవకాశం లేకపోలేదు. కానీ వాళ్లందరి కంటే ఎన్టీఆర్ తో రిషబ్ శెట్టి సినిమాకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్లు ఎంత క్లోజ్ అన్నది ఇటీవలే బయట పడింది. తారక్ తల్లి, భార్య, పిల్లలతో కర్ణాటవెళ్లిన నేపథ్యంలో రిషబ్ శెట్టి దంపతులు ఇచ్చిన ఆతిధ్యం గురించి తారక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత దేవాలయ దర్శనం సౌకర్యవంతంగా జరిగిందంటే దానికి కారణం రిషబ్ అంటూ తారక్ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చారు. రిషబ్ శెట్టి-తారక్ తల్లి ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం విశేషం.ఈ నేపథ్యంలో తారక్ అనే స్నేహితుడిని రిషబ్ శెట్టి వెండి తెరపై ఎలా చూపించాలి అనుకుంటున్నాడో? ఇప్పటికే తనకు ఓ ఐడియా ఉండే ఉంటుంది.
తారక్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి రిషబ్ తన రైటింగ్ కం డైరెక్షన్ మాయాజాలంతో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లగలడు. అందులో రిషబ్ కూడా నటుడిగా జాయిన్ అయితే ఆ ప్రాజెక్ట్ ఏకంగా పెద్ద మల్టీస్టారరే అవుతుంది. భవిష్యత్ లో ఈ కాంబినేషన్ కు చాలా వరకూ ఆస్కారం ఉంది. ఆసినిమాలో ఇద్దరు కలిసి నటించొచ్చు లేదా? తారక్ హీరోగా రిషబ్ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చు. తారక్ అభిమానులంతా ఈ విషయాన్ని ఎలాంటి సందేహాలు లేకుండా దర్జాగా రాసి పెట్టుకోవొచ్చు.
