కాంతార1 కోసం రిషబ్ భారీ ప్లాన్
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు పలు విషయాల్లో చాలా డెడికేషన్ తో ఉంటూంటారు. డైట్ దగ్గర నుంచి, వర్కవుట్ వరకు ప్రతీ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటారు.
By: M Prashanth | 26 Sept 2025 2:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు పలు విషయాల్లో చాలా డెడికేషన్ తో ఉంటూంటారు. డైట్ దగ్గర నుంచి, వర్కవుట్ వరకు ప్రతీ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటారు. కొన్ని రకాల సినిమాలు చేసేటప్పుడు దాని కోసం తమ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. ఇప్పుడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి కూడా అలానే చేశారు.
అక్టోబర్ 2న కాంతార1 రిలీజ్
కన్నడ నుంచి రాబోతున్న భారీ సినిమాల్లో కాంతార: చాప్టర్1 కూడా ఒకటి. కన్నడ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాంతార మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించగా, కాంతార చాప్టర్1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాంతార క్లైమాక్స్ కంటే మరింత పవర్‌ఫుల్‌గా..
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా, ఆడియన్స్ నుంచి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న రిషబ్ శెట్టి కాంతార చాప్టర్1 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే కాంతార క్లైమాక్స్ కంటే ఈ సినిమా క్లైమాక్స్ మరింత పవర్‌ఫుల్ గా ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఆ సీన్ అందరికీ స్పూర్తినిస్తుంది
కాంతార1లోని ఓ స్పెషల్ సీన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని, భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఆ సీన్ గురించి మాట్లాడతారని, డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నికల్ టీమ్ అంతా దాన్ని ఇన్సిపేరేషన్ గా తీసుకుంటారని ఊరిస్తున్నారు రిషబ్. ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కాంతార చాప్టర్1లో రిషబ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
చెప్పులు వేసుకోలేదు.. మాంసాహారం ముట్టుకోలేదు
ఈ మూవీలో దేవుడికి సంబంధించిన సీన్స్ ను చేసేటప్పుడు తాను కొన్ని కఠిన నియమాలను కూడా పాటించినట్టు రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. ఆ టైమ్ లో చెప్పులు వేసుకోకుండా, ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఉన్నానని, తనకు దేవునిపై నమ్మకమెక్కువని, అలా అని వేరే వారిని ఈ విషయంలో ఒత్తిడి చేయనని, ఎవరి ఇష్టం వారికుంటుందని, ఎవరి నమ్మకం వారిదని ఆయన అన్నారు.
