సితారతో రిషబ్.. ఫ్యూజులు ఔట్ అవ్వడం ఖాయమా..?
కన్నడ పరిశ్రమ నుంచి కాంతారా, కాంతారా చాప్టర్ 1 తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.
By: Ramesh Boddu | 30 Oct 2025 11:00 PM ISTకన్నడ పరిశ్రమ నుంచి కాంతారా, కాంతారా చాప్టర్ 1 తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆ రెండు సినిమాలతో తన యాక్టింగ్ విశ్వరూపంతో పాటు డైరెక్షన్ టాలెంట్ కూడా చూపించాడు రిషబ్ శెట్టి. ఐతే రిషబ్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ రెండు టాలీవుడ్ లో రూపొందించబడుతున్నాయి. ఆల్రెడీ సూపర్ హిట్ ఫ్రాంచైజీ హనుమాన్ సీక్వెల్ లో రిషబ్ శెట్టి నటిస్తున్నాడని తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ లో రిషబ్ శెట్టి ఓకే చేశాడంటే..
ఇక ఆ సినిమాతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మాణంలో రిషబ్ శెట్టితో ఒక భారీ సినిమా రాబోతుంది. ఆ సినిమా పీరియాడికల్ స్టోరీతో రాబోతుంది. ఆకాశవాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. రిషబ్ శెట్టి ఓకే చేశాడంటే సినిమా స్టోరీ కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.
రిషబ్ శెట్టి కూడా ఇదివరకు తెర మీద ఎప్పుడు చూడని కథలనే ఎంపిక చేసుకుంటున్నాడు. పీరియాడికల్ కథలో కొత్త స్టోరీతో సితార బ్యానర్ లో రిషబ్ శెట్టి సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా లో రిషబ్ రోల్ మరోసారి ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేస్తుందట. ఓ పక్క జై హనుమాన్ లో రిషబ్ హనుమాన్ రోల్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు.
పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్లు..
మరోపక్క సితార తో కలిసి ఒక పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో రిషబ్ టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోనున్నాడు. ఈమధ్య తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్లు కొడుతున్నాయి. రిషబ్ శెట్టితో తెలుగు మేకర్స్ సిల్వర్ స్క్రీన్ పై మరిన్ని అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. రిషబ్ కూడా టాలీవుడ్ లో తనకు వస్తున్న ఈ అవకాశాలతో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు.
సితార నాగ వంశీ బ్యానర్ లోనే రిషబ్ శెట్టి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో రిషబ్ శెట్టి ఇన్వాల్వ్ మెంట్ కూడా సినిమాపై మరింత బజ్ పెంచేస్తుంది. ఆల్రెడీ తానొక డైరెక్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు కాబట్టి రాబోతున్న ఈ సినిమాలు కూడా తప్పకుండా రిషబ్ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా ఉంటాయని చెప్పొచ్చు. రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న జై హనుమాన్ ని జనవరి నుంచి మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉండగా ఆ సినిమాతో ఈక్వెల్ గా ఈ పీరియాడికల్ సినిమా చేస్తారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా 2027 లో రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంది.
