కామెంట్స్ ఎఫెక్ట్.. ఈసారి మాత్రం తెలుగులోనే..
కన్నడ నటుడు రిషబ్ శెట్టిపై ఇటీవల కొందరు టాలీవుడ్ మూవీ లవర్స్, అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
By: M Prashanth | 1 Oct 2025 9:28 AM ISTకన్నడ నటుడు రిషబ్ శెట్టిపై ఇటీవల కొందరు టాలీవుడ్ మూవీ లవర్స్, అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
ఆ కార్యక్రమానికి హాజరైన రిషబ్.. కేవలం కన్నడలోనే మాట్లాడడం తీవ్ర వివాదానికి దారితీసింది. తెలుగు భాషకు గౌరవం ఇవ్వలేదని అనేక మంది మండిపడ్డారు. మరి అంత ఫ్లూయెంట్ గా రాకపోయినా.. రిషబ్ కు నార్మల్ గా తెలుగు వచ్చు. కానీ హైదరాబాద్ లో కన్నడలో మాట్లాడడంతో.. ఏకంగా సినిమా బ్యాన్ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.
టికెట్ రేట్స్ ను కూడా పెంచొద్దని ప్రభుత్వాలను కోరారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంచి భావనతో ఆలోచించాలని సూచించారు. టికెట్ రేట్స్ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ చాలా మందిలో ఇంకా అసంతృప్తి అలానే ఉంది. ఇప్పుడు రిషబ్ శెట్టి రంగంలో దిగారు! విజయవాడ ఈవెంట్ లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడారు.
అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు ప్రజల ప్రేమ తనకు ఎంతో విలువైనదని తెలిపారు రిషబ్. అప్పుడు కాంతార మూవీ భారీ విజయం సాధించడంలో మీ అభిమానమే కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున కాంతార మూవీ రిలీజ్ అయిందని గుర్తు చేశారు.
ఇప్పుడు అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 సినిమా కూడా రిలీజ్ అవుతుందని మరోసారి తెలిపారు. ఈ సినిమాకు కూడా సపోర్ట్ చేయాలని కోరారు. కాంతార చాప్టర్ 1 కూడా మీ అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నానని చెప్పారు. దీంతో వేడుకకు వచ్చిన ఆడియన్స్.. చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు.
ఆ తర్వాత కన్నడ తెలుగు అన్నదమ్ముల లాంటివారని తెలిపారు. అయితే కార్యక్రమంలో కేవలం రిషబ్ ఒక్కరే కాకుండా కార్యక్రమానికి వచ్చిన వారంతా తెలుగులోనే మాట్లాడి సందడి చేశారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ ను తగ్గించాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ఇప్పుడు తెలుగులో మాట్లాడి.. టాలీవుడ్ సినీ ప్రియుల కోపాన్ని చల్లారేలా ట్రై చేశారు.
