Begin typing your search above and press return to search.

హృతిక్ రోషన్ తో కాంతారా..?

ఐతే ఈ క్రమంలో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా ఉంటుందని లేటెస్ట్ న్యూస్. రిషబ్ శెట్టి ముంబై లో చాలా ఏళ్లు ఉన్నాడు.

By:  Ramesh Boddu   |   10 Oct 2025 11:37 AM IST
హృతిక్ రోషన్ తో కాంతారా..?
X

కాంతారా సినిమాతో నేషనల్ వైడ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేశాడు రిషబ్ శెట్టి. ఆ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక 3 ఏళ్ల గ్యాప్ తో కాంతారా చాప్టర్ 1 అంటూ మరో సంచలనంతో ముందుకొచ్చాడు. కాంతారా సినిమాలోనే రిషబ్ యాక్టింగ్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయితే.. ఇక కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ పూనకాలు తెప్పించేసింది. ఇండియన్ స్క్రీన్స్ పై ఇలాంటి ఒక ఒళ్లు పులకరించే అభినయాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. అందుకే తన పేరుని తనకు తానుగా సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు రిషబ్ శెట్టి.

రిషబ్ శెట్టి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్..

రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 కేవలం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు సినిమా చూసిన బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా వారెవా అనేస్తున్నారు. ఐతే కాంతారా చాప్టర్ 1 థియేటర్ లో సందడి చేస్తున్న ఈ టైం లో రిషబ్ శెట్టి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ లోకి వచ్చింది. కాంతారా, కాంతారా చాప్టర్ 1 లో రిషబ్ యాక్టింగ్ గురించి అందరు మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ సినిమాలకు డైరెక్టర్ కూడా అతనే అన్న విషయం మర్చిపోకూడదు.

అటు యాక్టింగ్ చేస్తూనే అన్ని క్రాఫ్ట్ లు మేనేజ్ చేయడం అన్నది సాధారణమైన విషయం కాదు. కాంతారా రెండు సినిమాలు చూసిన ఆడియన్స్ మాక్సిమం నటుడిగా రిషబ్ శెట్టికి 100కి 100 మార్కులు వేస్తారు. కానీ ఒక కథ దాన్ని హ్యాండిల్ చేసి సక్సెస్ కొట్టిన విధానం మళ్లీ దానికి ప్రీక్వెల్ గా మరో కథ దాన్ని కూడా సరైన కథ కథనాలతో తీసుకు రావడంలో రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు.

ముంబై లో చాలా ఏళ్లు..

అందుకే డైరెక్టర్ గా కూడా రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా ప్రశంసింఛాల్సిందే. ఐతే ఈ క్రమంలో రిషబ్ శెట్టి డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా ఉంటుందని లేటెస్ట్ న్యూస్. రిషబ్ శెట్టి ముంబై లో చాలా ఏళ్లు ఉన్నాడు. అతనికి బాలీవుడ్ ఫిల్మ్ సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఐతే కాంతారా మేకర్ గా తను సినిమా చేస్తా అంటే కాదనే ఛాన్స్ లేదు.

అందుకే రిషబ్ శెట్టి హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ముంబై మీడియా న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఐతే ఈ కాంబో గురించి అసలు ఇంతకుముందు ఎక్కడ డిస్కషన్ రాలేదు. మరి నిజంగానే హృతిక్ రోషన్ కోసం రిషబ్ సినిమా డైరెక్ట్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. కన్నడలో తన డైరెక్షన్ టాలెంట్ తో సూపర్ హిట్ సినిమాలు చేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు యాక్టర్ గా కాంతారా సీరీస్ లతో టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీస్ గా మారాడు.