Begin typing your search above and press return to search.

'విరోష్' వెడ్డింగ్.. రిషబ్ అలా అనేశారేంటి?

'విరోష్' వెడ్డింగ్ మరికొన్ని గంటల్లో జరగనున్న వేళ.. కన్నడ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి చిన్న రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   25 Feb 2026 10:19 PM IST
విరోష్ వెడ్డింగ్.. రిషబ్ అలా అనేశారేంటి?
X

'విరోష్' వెడ్డింగ్ మరికొన్ని గంటల్లో జరగనున్న వేళ.. కన్నడ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి చిన్న రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ హీరో విజయ్ దేవరకొండ వివాహ వేడుకలు రాజస్థాన్‌ ఉదయ్‌ పూర్ లో అంగరంగ వైభవంగా జరుగుతుండగా.. ఆ వేడుకకు రిషబ్ కు ఆహ్వానం అందలేదనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి.

గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం విజయ్, రష్మిక వివాహం జరగనుండగా.. పెళ్లి మెమెంటోస్ బై ఐటీసీ హోటల్ లో జరగనుంది. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆ ప్రైవేట్ వేడుకలకు హాజరవుతున్నారు. సోషల్ మీడియాలో విరోష్ వెడ్డింగ్ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

అదే సమయంలో రిషబ్ శెట్టి మంత్రాలయం వెళ్లి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. రష్మిక పెళ్లికి మిమ్మల్ని పిలిచారా? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా, ఆయన కేవలం థ్యాంక్యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

రష్మిక సినీ జర్నీ రిషబ్ దర్శకత్వంలో వచ్చిన కిరిక్ పార్టీతో ప్రారంభమైంది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్‌ గా ఎదిగారు. ఇక రిషబ్ నటించిన కాంతార గురించి ఒకప్పుడు రష్మిక స్పందించకపోవడం కూడా అప్పట్లో వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెళ్లి ఆహ్వానంపై ఆయన స్పందించకపోవడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

ఇక రష్మిక, విజయ్ ప్రేమ కథ విషయానికి వస్తే.. ఇద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సినిమాతో వారి జంటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సమయంలో వారి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారినట్టు వినికిడి. విదేశీ టూర్లు, సోషల్ మీడియా పోస్టులు, ఈవెంట్లలో కలిసి కనిపించడం.. ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచాయి. ఇప్పుడు ఆ స్టార్ కపుల్ పెళ్లి పీటలెక్కుతుండటంతో అంతా ఆనందంలో మునిగిపోయారు.

ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం కొడవ శైలిలో వివాహం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విరోష్ పెళ్లి వేడుకలు ఒకవైపు పుల్ జోష్ లో జరుగుతుండగా.. మరోవైపు రిషబ్ శెట్టి రియాక్షన్ మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. మరి వారిద్దరి మధ్య నిజంగా దూరం ఏమైనా ఉందా? లేక రూమర్లేనా? అన్నది తెలియాల్సి ఉంది.