పాన్ ఇండియా స్టార్ తో ఆ సంస్థ బిగ్ డీల్!
ఈ నేపథ్యంలో బడా నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు నిర్మించడానికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నుంచి మైత్రీ మూవీమేకర్స్ అతడితో ఓ బిగ్ డీల్ కుదుర్చుకుందని వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 31 Oct 2025 7:00 AM ISTకన్నడ స్టార్ రిషబ్ శెట్టి పాన్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయ్యాడు అన్నది చెప్పాల్సిన పనిలేదు. తనని తానే పాన్ ఇండియా స్టార్ గా మలుచుకున్నాడు. `కాంతార` అనే ప్రాంచైజీతో మార్కెట్లో తానో బ్రాండ్ అయ్యాడు. ఇటీవల రిలీజ్ అయిన `కాంతార చాప్టర్ వన్` ఏకంగా 800 కోట్లు వసూళ్లు సాధించడంతో? అతడు ఎంత పెద్ద స్టార్ అన్నది క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. కన్నడ నుంచి యశ్ తర్వాత అంతటి స్టార్ గా పరిశ్రమలు కీర్తిస్తున్నాయి. కేవలం నట కౌశలంతో మాత్రమే ఎదిగిన నటుడిగా ప్రశంసిస్తున్నారు. దీంతో అతడి భవిష్యత్ ని విశ్లేషించడం అన్ని చిత్ర పరిశ్రమల్లో మొదలైంది.
ఈనేపథ్యంలో బడా నిర్మాణ సంస్థలు అతడితో సినిమాలు నిర్మించడానికి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నుంచి మైత్రీ మూవీమేకర్స్ అతడితో ఓ బిగ్ డీల్ కుదుర్చుకుందని వినిపిస్తోంది. భారీ మొత్తంలో రిషబ్ శెట్టికి అడ్వాన్స్ రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. ఆ మొత్తం కూడా ఇప్పటి కిప్పుడు సినిమా చేయమని కాదట. తనకు వీలైన సమయంలో తమ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడగడంతో కాదనకుండా ఒప్పుకున్నాడుట. తన బిజీ షెడ్యూల్ పూర్తిగా వివరించిన తర్వాత...అన్నీ ఒకే అనుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వండని అన్నాడుట.
దీనికి అంగీకరించిన సదరు సంస్థ మరో ఆలోచన లేకుండా అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ రాసుకున్నారుట.సక్సస్ లో ఉన్న దర్శక, నటుల విషయంలో టాలీవుడ్ ఎంత చురుకుగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా మైత్రీ గురించి బయటకు తెలిసిన సమాచారం. మరి తెలియకుండా ఇంకెంత మంది రిషబ్ ని అడ్వాన్సులతో ముంచెత్తారో? సొంత పరిశ్రమ కన్నడ నుంచి కూడా భారీగానే క్యూలో ఉండే ఉంటారు. సొంత పరిశ్రమకు రిషబ్ కూడా తొలి ప్రాధాన్యత ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే `కాంతార` రిలీజ్ అనంతరం `చాప్టర్ వన్` కోసం హొంబలే ఫిల్మ్స్ నుంచి అడ్వాన్స్ అందుకుని `కాంతార చాప్టర్ వన్` ని పట్టాలెక్కించాడు.
ప్రస్తుతం రిషబ్ చాలా బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో `జై హనుమాన్` లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ బయోపిక్ కోసం పని చేస్తున్నాడు. ` కాంతార` చాప్టర్ 2` కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. మరి ఈ చిత్రాన్ని ఏ బ్యానర్లో నిర్మిస్తాడు? అన్నది చూడాలి. మైత్రీ ప్లాన్ `చాప్టర్ 2` అయితే గనుక బంపర్ ఆఫర్ దక్కినట్లే.
