Begin typing your search above and press return to search.

అప్పుడు ఆఫీస్ బాయ్.. ఇప్పుడు స్టార్ హీరో..!

రిషబ్ శెట్టి 2022 కాంతారా రిలీజ్ ముందు వరకు అతనొక కన్నడ హీరో కం డైరెక్టర్ మాత్రమే. కానీ ఎప్పుడైతే కాంతారా రిలీజైందో అప్పటి నుంచి అతను పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

By:  Ramesh Boddu   |   30 Sept 2025 9:38 AM IST
అప్పుడు ఆఫీస్ బాయ్.. ఇప్పుడు స్టార్ హీరో..!
X

రిషబ్ శెట్టి 2022 కాంతారా రిలీజ్ ముందు వరకు అతనొక కన్నడ హీరో కం డైరెక్టర్ మాత్రమే. కానీ ఎప్పుడైతే కాంతారా రిలీజైందో అప్పటి నుంచి అతను పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాను రిషబ్ శెట్టి నటించడమే కాకుండా డైరెక్ట్ చేశారు. సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాంతారా పై ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని కాంతారా చాప్టర్ 1 అంటూ మరో సినిమా చేశాడు రిషబ్ శెట్టి.

ప్రొడక్షన్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా..

ఈ సినిమా అక్టోబర్ 2 దసరా కానుకగా రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబై ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు రిషబ్ శెట్టి. ముంబై తనకు చాలా నచ్చుతుందని ఎందుకంటే 2008లో తాను ఇక్కడ ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేశానని రిషబ్ శెట్టి చెప్పారు. అధేరి వెస్ట్ సైడ్ లో ఒక ప్రొడక్షన్ లో తాను ఆఫీస్ బాయ్, ప్రొడ్యూసర్ కి డ్రైవర్ గా చేశానని సినిమా అనేది గాడ్ అని ఇక్కడ ఏదైనా జరుగుతుందని అన్నారు రిషబ్ శెట్టి.

అప్పుడు ఆఫీస్ బాయ్ గా ఉన్న రిషబ్ శెట్టి ఇప్పుడు ముంబైలో ఒక క్రేజీ సినిమాతో సత్తా చాటుతున్నాడు. సినిమాకు ఉన్న పవర్ అలాంటిదే ఒక్క సినిమా చాలు ఎవరి ఫేట్ అయినా ఇలా మారిపోతుంది. రిషబ్ శెట్టి 2008లో ఆఫీస్ బాయ్ గా చేసి ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేస్తూ వచ్చారు. కాంతారా తో నేషనల్ లెవెల్ లో ఆయనకు గుర్తింపు వచ్చింది.

కాంతారా ప్రీక్వెల్.. రిషబ్ శెట్టి అండ్ టీం..

కాంతారా చాప్టర్ 1 సినిమా ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. రిలీజ్ ప్రమోషన్స్ లో రిషబ్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు చెప్పారు. రిషబ్ శెట్టి అండ్ టీం నిజంగానే కాంతారా ప్రీక్వెల్ కాంతర చప్టర్ 1 కోసం భారీ రిస్క్ చేశారు. ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తుంది.

కాంతారా చాప్టర్ 1 సినిమా తెలుగులో కూడా విపరీతమైన బజ్ ఏర్పరచుకుంది. సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటే మాత్రం నేషనల్ లెవెల్ లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.