Begin typing your search above and press return to search.

'కొత్త' కాంతార.. OG తట్టుకుంటుందా?

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   2 Oct 2025 10:44 AM IST
కొత్త కాంతార.. OG తట్టుకుంటుందా?
X

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1ను తెరకెక్కించి.. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. దసరా సందర్భంగా నేడు సినిమా రిలీజ్ అవ్వగా.. నిన్ననే కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి.

కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అంతా ప్రీక్వెల్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మేకర్స్.. ప్రమోషన్స్ ను మాత్రం అనుకున్నంత స్థాయిలో నిర్వహించకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువ జరిగాయి. కానీ ఇప్పుడు ప్రీమియర్స్ పడిన తర్వాత సోషల్ మీడియాలో బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతోంది.

సినిమా అద్భుతంగా ఉందని.. రిషబ్ శెట్టి మరోసారి అదరగొట్టేశారని ప్రీమియర్స్ చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు.. పోస్టులు పెడుతున్నారు. దీంతో ఓవరాల్ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందనేది ఆసక్తికరం. అయితే ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్ చూస్తుంటే మాత్రం.. సినిమా అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

అదే సమయంలో గత వారం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. రీసెంట్ గా సినిమా వరల్డ్ వైడ్ గా రూ.252 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు.

ఇప్పుడు రూ.300 కోట్ల క్లబ్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అయితే ఓజీ సినిమాకు ఆడియన్స్ లో రిలీజ్ అయిన మొదటి మూడు రోజులు బజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండేది. మేకర్స్ కూడా దాన్ని అలాగే నిలుపుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రమోషన్స్ ను కాస్త తగ్గించారు. దీంతో మొదటి వీకెండ్ అయ్యాక బజ్ కూడా చాలా వరకు తగ్గింది.

మేకర్స్ వెంటనే గ్రహించారేమో.. మళ్లీ ప్రమోషన్స్ తో బజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. పవన్ కూడా అటెండ్ అయ్యి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. దాంతోపాటు టికెట్ రేట్లు చాలా చోట్ల తగ్గాయి. అందుకే దసరా వీకెండ్ లో వసూళ్లు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతలో కాంతార మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. దీంతో ఓజీ దసరా కలెక్షన్లపై ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమో చూడాలి.