'కాంతార' రిషబ్.. అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదేమో!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Sept 2025 2:33 PM ISTకన్నడ నటుడు రిషబ్ శెట్టి.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రాబోతున్న ఆ మూవీ.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ అంచారు. సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు.
రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాగా.. రిషబ్ శెట్టి సహా పలువురు అటెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈవెంట్ తర్వాత రిషబ్ శెట్టిపై టాలీవుడ్ మూవీ లవర్స్ ఫైర్ అవుతున్నారు.
ఎందుకంటే.. ఆయన నిన్న వేదికపై ప్రసంగించే సమయంలో తెలుగులో మాట్లాడలేదు రిషబ్. కేవలం కన్నడలోనే ప్రసంగించారు. టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న రిషబ్ శెట్టి.. ప్రాంతీయ భాషలో మాట్లాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో మండిపడుతున్నారు. ఇది అస్సలు కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.
దీంతో రిషబ్ శెట్టి.. తెలుగును గౌరవించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కన్నడ, తెలుగు భాషలు ఒకేలా అనిపిస్తాయి కనుక.. కొన్ని తెలుగు పదాలు స్పీచ్ లో ఉపయోగించినట్లు అనిపించింది. కానీ ఆయన మొత్తం కన్నడలోనే మాట్లాడారు. దీంతో తెలుగు వచ్చినా.. కూడా ఆయన కన్నడలో మాట్లాడారని విమర్శిస్తున్నారు.
కాగా, రిషబ్ శెట్టికి తెలుగులో మంచి మార్కెట్ లో ఉన్న విషయం తెలిసిందే. కాంతార ఫస్ట్ పార్ట్ కూడా హిట్ అవ్వడంతో.. ప్రీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా మూవీ అలరిస్తుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నారు. తీరా ఇప్పుడు ప్రసంగం విషయంలో వ్యతిరేకత వస్తోంది.
ఇక కాంతార ప్రీక్వెల్ విషయానికొస్తే.. రిషబ్ శెట్టి నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై కిరగందూర్ నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ కానున్న కాంతార ప్రీక్వెల్.. తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
