Begin typing your search above and press return to search.

కొత్త 'కాంతార' రేట్లు.. సినీ వర్గాల అభ్యంతరం.. పవన్ ఏమన్నారంటే?

కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ కాంతార చాప్టర్ 1.

By:  M Prashanth   |   30 Sept 2025 11:26 AM IST
కొత్త కాంతార రేట్లు.. సినీ వర్గాల అభ్యంతరం.. పవన్ ఏమన్నారంటే?
X

కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ కాంతార చాప్టర్ 1. బ్లాక్ బస్టర్ హిట్ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా రిలీజ్ కానుండగా.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. దీంతో ఈ విషయంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బింగ్ మూవీస్ కు ఎలా పెంచుతారని డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే తెలుగు సినీ వర్గాలు.. అనేక అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాయి. కర్ణాటకలో మన సినిమాలు రిలీజ్ సమయంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వానికి తెలిపాయి. టికెట్ రేట్స్ పెంచేందుకు కూడా అనుమతులు ఇవ్వడం లేదని చెప్పాయి. పోస్టర్లు, బ్యానర్లను కొందరు తొలగిస్తున్నారని వాపోయాయి.

కానీ అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని ఆర్‌ఆర్ఆర్‌, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ సహా అనేక సినిమాల విషయంలో జరిగిన వాటికి దృష్టికి తెచ్చాయి. దీంతో కన్నడ చిత్రాల టికెట్ రేట్లను ఆంధ్రప్రదేశ్ లో పెంచుకునే విషయంలో పునరాలోచించాలని కోరాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

కాంతార ప్రీక్వెల్ ధరల పెంపు విషయంలో చర్చించామని పవన్ తెలిపారు. తెలుగు సినిమాలకు అక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయని, ఇక్కడ మన ప్రోత్సహించకుండా ఉండొద్దని చెప్పారు. ఏ విషయంలో అయినా మంచి మనసుతో ఆలోచించాలని పేర్కొన్నారు. అక్కడ హీరోలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారన్నారు.

గతంలో రాజ్ కుమార్ నుంచి నేటి నటులు సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకు తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ కన్నడ తారలను స్వాగతిస్తున్నారని చెప్పారు. అందుకే సోదరభావంతో ఉండాలని, అయితే కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులు తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఇబ్బందులపై రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూడా చర్చించుకోవాలని సూచించారు.