Begin typing your search above and press return to search.

రిషబ్ శెట్టి.. ప్రభాస్ సరసన చేరాడుగా!

ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఆయన.. తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను వేసుకున్నారు.

By:  M Prashanth   |   6 Oct 2025 12:52 PM IST
రిషబ్ శెట్టి.. ప్రభాస్ సరసన చేరాడుగా!
X

కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి.. కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని సత్తా చాటారు. అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు.

ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఆయన.. తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను వేసుకున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తన యాక్టింగ్ అండ్ మేకింగ్ టాలెంట్ తో ఇప్పటికే ఫిదా చేశారు.

అక్టోబర్ 2వ తేదీన సినిమా రిలీజ్ అవ్వగా.. ముందు రోజు ప్రీమియర్స్ పడ్డాయి. అయితే అప్పటి వరకు పరిస్థితి ఒకలా ఉంటే.. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అందుకు ముఖ్య కారణం మౌత్ టాక్. ప్రీమియర్స్ షో పడ్డాక పాజిటివ్ మౌత్ టాక్ ఫుల్ గా స్ప్రెడ్ అయింది.

దీంతో అంతా సినిమా చూసేందుకు ఇంట్రెస్టింగ్ చూపించారు. అంతా ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. తద్వారా ఒక్క బుక్ మై షో టికెటింగ్ ప్లాట్ ఫామ్ లో తొలి రోజుకు గాను మిలియన్ టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి. గురువారానికి గాను 1.28 మిలియన్ టిక్కెట్లు సేల్ అవ్వడం విశేషం.

ఆ తర్వాత రోజు శుక్రవారానికి 1.27 మిలియన్లు, శనివారానికి 1.3 మిలియన్లు, ఆదివారానికి 1.04 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు కూడా.. బుక్ మై షోలో కాంతార ప్రీక్వెల్ కు మిలియన్ టికెట్ నెంబర్లు నమోదయ్యాయి. దీంతో ఆ సినిమా.. ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సరసన చేరింది.

గత ఏడాది రిలీజ్ అయిన కల్కి మూవీ.. తొలి నాలుగు రోజులు కూడా బుక్ మైషోలో మిలియన్ మార్క్ అందుకుంది. ఇప్పుడు ఆ ఘనతను కాంతార ప్రీక్వెల్ కూడా సాధించింది. అయితే అల్లు అర్జున్ పుష్ప-2 మూవీ ఆరు.. మిలియన్ మార్క్ డేస్ ను సాధించింది. ఇప్పుడు బుక్ మై షో మిలియన్ టికెట్స్ లిస్ట్ లో ప్రభాస్ సరసన చేరారు రిషబ్ శెట్టి.