సక్సెస్ అంటే ఇదీ.. రిషబ్ ఎమోషనల్ పోస్ట్
సక్సెస్ ఎప్పుడెలా దక్కుతుందో, ఏ స్థాయిలో దక్కుతుందో ఎవరూ చెప్పలేం, ఊహించలేం. ఊహించని రీతిలో సక్సెస్ దక్కినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Oct 2025 11:25 AM ISTసక్సెస్ ఎప్పుడెలా దక్కుతుందో, ఏ స్థాయిలో దక్కుతుందో ఎవరూ చెప్పలేం, ఊహించలేం. ఊహించని రీతిలో సక్సెస్ దక్కినప్పుడు ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. ఇప్పుడలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఆయన నటించిన కాంతార సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కాంతార చాప్టర్1 కు అదిరిపోయే రెస్పాన్స్
కాంతార సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1 ను కూడా తానే స్వీయ దర్శకత్వం వహిస్తూ నటించి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఆ సినిమాకు ఫస్ట్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మంచి టాక్ రావడంతో అన్ని ఏరియాల్లోని ఈవెనింగ్ షో లు మొత్తం హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
రిక్కీ మూవీతో డైరెక్టర్ గా మారిన రిషబ్
కాంతార చాప్టర్1 ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం పట్ల తన ఆనందాన్ని వెల్లడిస్తూ రిషబ్ శెట్టి ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తన కెరీర్ జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు రిషబ్. 2012లో రిషబ్ శెట్టి తుగ్లక్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. 2016లో మొదటిసారిగా రిక్కీ అనే మూవీతో డైరెక్టర్ గా మారిన ఆయన 2022లో వచ్చిన కాంతారతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆడియన్స్ ఆదరణ వల్లే ఇదంతా సాధ్యమైంది
చిన్న సినిమాగా రిలీజైన కాంతార బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను, అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్1 కూడా అదే రీతిలో రెస్పాన్స్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. అయితే రిషబ్ 2016లో చేసిన సినిమా ఒక్క షో పడటం కోసం తానెంతో కష్టపడ్డానని, కానీ ఇప్పుడు 2025లో 5000కు పైగా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడటం వరకు ఎదిగానని, ఈ జర్నీలో భగవంతుడి దయతో పాటూ ఆడియన్స్ అభిమానం, ప్రేమ కూడా ఉన్నాయని, ఎప్పటికీ వాటిని మర్చిపోలేనని, అందరూ ఆదరించడం వల్లనే ఈ సక్సెస్ సాధ్యమైందని రాసుకొచ్చారు రిషబ్.
