ప్రశాంత్ వర్మ 'కాంతారా' చూడాలిక..?
ఐతే కాంతారా 1 కథ కొనసాగుతుంది కానీ మరో కాంతారా వచ్చే వరకు రిషబ్ శెట్టి వేరే సినిమాలు చేస్తాడు.
By: Ramesh Boddu | 17 Oct 2025 10:00 PM ISTకాంతారా చాప్టర్ 1 తో మరోసారి డైరెక్టర్, యాక్టర్ గా తన బెస్ట్ ఇస్తూ అదరగొట్టాడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. కాంతారా సినిమా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చింది కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయ్యిందని అందరు అనుకున్నారు. అఫ్కోర్స్ ఆ సినిమాలో రిషబ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక కాంతారా చాప్టర్ 1 కోసం రిషబ్ దాదాపు 3 ఏళ్లు కష్టపడ్డాడు. ఫైనల్ గా సినిమా రిజల్ట్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్నాడు. సినిమా కోసం పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చినట్టే అని చెప్పొచ్చు.
రిషబ్ శెట్టి చేయడంతో ప్రాజెక్ట్ పై హైప్..
ఐతే కాంతారా 1 కథ కొనసాగుతుంది కానీ మరో కాంతారా వచ్చే వరకు రిషబ్ శెట్టి వేరే సినిమాలు చేస్తాడు. అందులో ముఖ్యంగా తెలుగు సూపర్ హీరో మూవీ జై హనుమాన్ చేయాల్సి ఉంది. హనుమాన్ సీక్వెల్ గా ప్రకటించిన జై హనుమాన్ సినిమా లీడ్ రోల్ విషయంలో చాలా వరకు సస్పెన్స్ ఉంది. ఫైనల్ గా రిషబ్ శెట్టి ఆ రోల్ కి సైన్ చేయడంతో ప్రాజెక్ట్ పై హైప్ పెరిగింది. డైరెక్టర్ కం యాక్టర్ గా రిషబ్ కాంతారా 1 తో సూపర్ హిట్ సెన్సేషన్ సృష్టించాడు.
ఇక నెక్స్ట్ ఆయన జై హనుమాన్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. తేజ సజ్జతో లిమిటెడ్ బడ్జెట్ తో హనుమాన్ తీశాడు ప్రశాంత్ వర్మ. ఐతే ఆ సినిమా సృష్టించిన అద్భుతాలకు జై హనుమాన్ రేంజ్ పెరిగింది. సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఐతే రిషబ్ లాంటి యాక్టర్ తో ప్రశాంత్ వర్మ చేస్తున్న జై హనుమాన్ మరో కాంతారా అవాలి. ఐతే కాంతారా కథ వేరు జై హనుమాన్ కథ వేరు. కానీ రెండు డివోషనల్ సబ్జెక్ట్స్ కాబట్టి కలిసి వచ్చే అంశమే.
రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ గా..
జై హనుమాన్ లో రిషబ్ శెట్టి లార్డ్ హనుమాన్ గా కనిపించబోతున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను భారీ ప్లానింగ్ తో తెరకెక్కించబోతున్నారు. ఎలాగు మిగతా కమిట్మెంట్స్ కూడా ఏవి లేవు కాబట్టి రిషబ్ తో ప్రశాంత్ జై హనుమాన్ షురూ చేయనున్నారు. డైరెక్టర్ గా తన టాలెంట్ తో తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో కూడా అద్భుతాలు చేస్తాడా లేదా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
రిషబ్ కూడా జై హనుమాన్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ, రిషబ్ కలిసి చేయబోతున్న ఈ మూవీ 2027 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది. రిషబ్ శెట్టి జై హనుమాన్ తో పాటుగా ఛత్రపతి శివాజి బయోపిక్ తో పాటుగా సితార బ్యానర్ చేస్తున్న మరో సినిమాకి కూడా సైన్ చేశాడు.
