Begin typing your search above and press return to search.

ఛాంటింగ్ కార్నర్.. కొబ్బరి నూనెతో కిచెన్.. అబ్బో రిషబ్ ఇంటి ప్రత్యేకతలు మరెన్నో!

రిషబ్ శెట్టి ఉడుపిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న మేన్షన్ విలువ 12 కోట్లు.

By:  Madhu Reddy   |   14 Oct 2025 9:00 PM IST
ఛాంటింగ్ కార్నర్.. కొబ్బరి నూనెతో కిచెన్.. అబ్బో రిషబ్ ఇంటి ప్రత్యేకతలు మరెన్నో!
X

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా వైడ్ పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు కాంతార చాప్టర్ 1 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి .. బాహుబలి మూవీ రికార్డులనే బ్రేక్ చేస్తూ కేవలం 12 రోజుల్లోనే 675 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించారు. అలా ప్రస్తుతం ఎక్కడ చూసినా రిషబ్ శెట్టి పేరు మారుమ్రోగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి రిషబ్ శెట్టి ఇల్లు. ఇది ఇల్లు మాత్రమే కాదు ఎన్నో అద్భుతమైన ప్రత్యేకతలు కలిగి ఉంది.మరి రిషబ్ శెట్టి ఇల్లు ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి? దాని ధర ఎంత? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రిషబ్ శెట్టి ఉడుపిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న మేన్షన్ విలువ 12 కోట్లు. ఇంటిని తన అభిరుచికి తగ్గట్టుగా.. ట్రెడిషనల్ కర్ణాటక ఆర్కిటెక్చర్ కి మోడ్రన్ టెక్నాలజీని జత చేస్తూ చాలా వినూత్నంగా ఇంటిని నిర్మించుకున్నారు.. రిషబ్ శెట్టి అత్యంత ప్రత్యేకంగా నిర్మించుకున్న ఈ ఇంటి ప్రత్యేకతల విషయానికి వస్తే.. బర్మా టేక్ వుడ్, ఇత్తడిని కలగలిపి వుడ్ వర్క్ చేయించారట. సుమారుగా 300 కిలోల గ్రానైట్ రాయితో ప్రత్యేకంగా డిజైన్ చేసిన తులసి కోటను ఇంటిముందు ఏర్పాటు చేశారు. యక్షగానాన్ని తలపించే విషయాలు మరెన్నో ఇక్కడ ఆగుపిస్తాయి.

యువరాజ్ సింగ్ ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్ ఈ ఇంటికి ప్రత్యేక ఆకర్షణ. అద్భుతమైన ఛాంటింగ్ కార్నర్, బ్లాక్ స్టోన్ మీద 7 సెకండ్ల పాటు ఎవరైనా నిలబడితే కాంతార లోని భూతకోల ధ్వనించేలా ప్రత్యేకంగా అమర్చిన మ్యూజిక్ సిస్టం ఈ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు ఈ ఇంట్లో రిషబ్ అభిరుచికి తగ్గట్టుగా కాంతారలో ఉపయోగించిన రైఫిల్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. లివింగ్ రూమ్, ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలు మాత్రమే కాకుండా కిచెన్ కోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. కిచెన్ లో వాడిన నల్లరాతిని కొబ్బరి నూనెతో పాలిష్ చేయించారట.

అలాగే ప్రైవేటు స్క్రీనింగ్ రూమ్ కూడా డిజైన్ చేశారట. డాల్బీ అట్మాస్ సౌండ్ తో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ను అందిస్తుందని, ఇక్కడ ఇటాలియన్ లెదర్ రిక్లైనర్స్ స్పెషల్ అట్రాక్షన్ అని సమాచారం. రిషబ్ శెట్టి ఇంట్లో ఉన్న లైబ్రరీలో 1200 పుస్తకాలు ఉంటాయట. అందులో జానపద పుస్తకాల నుంచి స్టీఫెన్ కింగ్ నావెల్స్ వరకు ఉంటాయని తెలుస్తుంది. ఇక్కడ ఇంటి చుట్టూ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉంటాయట. విజిటర్స్ ఎవరైనా ఇంటి లోపలికి వెళ్లే ముందు బ్రాస్ లాకర్స్ లో తమ ఫోన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఇంటి వైఫై పాస్వర్డ్ ప్రతి నెల మారుతూ ఉంటుంది. ఆ పాస్వర్డ్స్ అన్ని కూడా కాంతార సినిమాలోని ఫేమస్ డైలాగులు కావడం గమనార్హం.

ఇక్కడ అన్నిటికంటే ప్రత్యేకమైనది రెయిన్ రూమ్. రిషబ్ కి చాలా ఇష్టమట. ముఖ్యంగా వర్షం పడేటప్పుడు దానిని ఆస్వాదిస్తూ కథలు రాసుకోవడం వల్ల ఇక్కడ క్రియేటివ్ టచ్ కలుగుతుందని చెబుతూ ఉంటారు. ఇలా ఒక్కటేమిటి మరెన్నో అద్భుతాలు అందరినీ ఆశ్చర్యపరిచేలా చాలా అద్భుతంగా రిషబ్ శెట్టి ఈ ఇంటిని రూపొందించుకున్నట్లు సమాచారం. ఇకపోతే కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ దాదాపు 90% తన సొంత ఊరిలోనే పూర్తి చేశారట.