Begin typing your search above and press return to search.

కాంతార 2లో రిషబ్ భార్యాపిల్లలు నటించారని తెలుసా.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

అటు కలెక్షన్లు కూడా వందల కోట్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి భార్యా పిల్లల్ని కూడా నటింపచేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

By:  Madhu Reddy   |   6 Oct 2025 12:53 PM IST
కాంతార 2లో రిషబ్ భార్యాపిల్లలు నటించారని తెలుసా.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!
X

సాధారణంగా ఒక సినిమా రూపొందుతోందంటే.. అది పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందంటే.. అందులో కచ్చితంగా తమ కుటుంబ సభ్యులను కూడా భాగం చేయాలి అని సెలబ్రిటీలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ బాబును మొదలుకొని ఎంతోమంది హీరోలు తమ తమ సినిమాలలో తమ వారసులను నటింపచేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రిషబ్ శెట్టి వంతు.. 2022లో కాంతార అంటూ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి.. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మొదటి రోజు ఏకంగా 89 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. రుక్మిణీ వసంత్.. కనకావతి పాత్రలో యువరాణిగా అదరగొట్టేసింది. అలాగే జయరాం, గుల్హన్ దేవయ్య లాంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా థియేటర్లలో 90% ఆక్యూపెన్సితో రన్ అవుతోంది. అటు కలెక్షన్లు కూడా వందల కోట్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి భార్యా పిల్లల్ని కూడా నటింపచేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విషయం తెలియడంతో వాళ్ళు ఏ పాత్రలలో కనిపించారు అంటూ తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రిషబ్ శెట్టి భార్యా పిల్లలకు ఎలాంటి పాత్రలు ఇచ్చారు? ఏ సన్నివేశంలో వాళ్ళు తెరపై కనిపిస్తారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి భార్య ప్రగతి రిషబ్ శెట్టి ఒక చిన్న పాత్ర పోషించింది. నిజానికి ఆమె పాత్రను క్షుణ్ణంగా పరిశీలన చేస్తే తప్ప ఐడెంటిఫై చేయలేము అనేది వాస్తవం. సినిమాలో కీలకమైన రథం సీన్లో రిషబ్ శెట్టి వీరోచితంగా పోరాడే సమయంలో ఒక లేడీ, ఇద్దరు పిల్లలను కాపాడుబోయే క్రమంలో కిందపడతాడు. అక్కడ రిషబ్ కాపాడే లేడీ పాత్రలో ప్రగతి రిషబ్ శెట్టి కనిపిస్తుంది. అక్కడ కనిపించిన ఆ ఇద్దరు పిల్లలు రిషబ్ శెట్టి పిల్లలు. అయితే ఇది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించే సన్నివేశం. అలాగే కాంతార చిత్రంలో కూడా ప్రగతి నటించింది.

కాంతార సినిమా స్టార్టింగ్ లోనే రాజుకు భార్యగా పిల్లాడిని ఎత్తుకొని కనిపిస్తుంది ప్రగతి రిషబ్ శెట్టి. అలా భర్త దర్శకత్వం చేసిన ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీలో ప్రగతి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. అంతేకాదు కన్నడ చాప్టర్ 1 సక్సెస్ పట్ల ఇటీవల భావోద్వేగానికి కూడా గురైంది ప్రగతి.

ప్రగతి విషయానికి వస్తే.. 2017 ఫిబ్రవరి 9న కర్ణాటకలో జరిగిన ఒక సన్నిహిత సాంప్రదాయ వేడుకలో ప్రగతిని వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. ప్రగతి వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్.అందుకే ఎక్కువగా ఆమె మీడియా కంటపడదు. అప్పుడప్పుడు రిషబ్ తో కలిసి బహిరంగ కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇటు పిల్లల ఆలనా పాలనా.. కుటుంబ బాధ్యతలు చేపట్టిన ప్రగతి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ప్రశంసనీయమని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం తన భర్త నిర్మాణ ప్రయాణంలో ప్రగతి కూడా మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం.