Begin typing your search above and press return to search.

రిషభ్ శెట్టి.. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ!

అయితే కాంతారా ప్రీక్వెల్ తర్వాత ప్రస్తుతం రిషబ్ చేతిలో కన్నడ ప్రాజెక్ట్ లు ఏమీ లేవు. కొత్తగా ఏ కన్నడ సినిమాకు సంతకం చేయలేదు.

By:  M Prashanth   |   31 July 2025 9:00 PM IST
రిషభ్ శెట్టి.. కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువ!
X

కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషభ్ శెట్టి భారీ విజయం అందుకున్నాడు. ఈ సినిమాతో పాన్ఇండియా స్టార్ గా మారడమే కాకుండా, నేషనల్ అవార్డ్ కూడా సాధించాడు. ప్రస్తుతం కాంతారకు ముందు కథ ప్రీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది. కాంతారాతో పాన్ఇండియా స్టార్ గా మారిన రిషభ్ ఇప్పుడు తెలుగు, హిందీ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టాడు.

ఈ రెండు ఇండస్ట్రీల్లో నేరుగా ఒరిజినల్ లాంగ్వేజెస్ సినిమాలతో తెరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. తెలుగులో డైరెక్ట్ గా జై హనుమాన్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇక హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి దేశభక్తి, భక్తి ఇతివృత్తాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే కాంతారా ప్రీక్వెల్ తర్వాత ప్రస్తుతం రిషబ్ చేతిలో కన్నడ ప్రాజెక్ట్ లు ఏమీ లేవు. కొత్తగా ఏ కన్నడ సినిమాకు సంతకం చేయలేదు. కానీ ఇదే సమయంలో బాలీవుడ్, టాలీవుడ్ లో చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే, రిషభ్ కన్నడ కంటే ఎక్కువగా తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక క్రేజ్ పెరిగితే, రెమ్యూనరేషనూ పెరుగుతుంది కదా! దీనికి రిషభ్ ఏమాత్రం మినహాయింపు కాదు. అతను కూడా పారితోషికం భారీగా పెంచాడటే. ఎంత భారీగా అంటే.. అతను కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలకే అత్యధికంగా తీసుకునే అంత అన్నమాట. అయితే తెలుగులోనూ అతడిని డీసెంట్ మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ ఉందని నమ్ముతున్న మేకర్స్ కూడా భారీగా ఇచ్చేందుకు వెనకాడడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరోవైపు, తెలుగు నిర్మాతలు కూడా పాన్ఇండియా రేంజ్ లో సినిమాలు నిర్మించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ లెక్కన రిషభ్ కు కాంతారాతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో వారు అతన్ని ప్రాజెక్ట్ కు ఒప్పించడానికి అత్యధిక పారితోషికం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని పరిశ్రమలో వినిపిస్తున్న మాట.

కాగా, కాంతారా ప్రీక్వెల్ సినిమా అక్టోబర్ 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రిషభ్ స్వయంగా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే తొలి పార్ట్ హిట్ కావడంతో ఈ ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.125 కోట్లు బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అజానీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.