కొత్త 'కాంతార'.. ఆ రోల్ కూడా రిషబ్ శెట్టినే పోషించారా?
ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. రిషబ్ శెట్టి డెడికేషన్ మామూలుగా లేదని చెబుతున్నారు.
By: M Prashanth | 27 Oct 2025 8:24 PM ISTకన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి కాంతార మూవీతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. ఆ సినిమాలో నటనతో అందరినీ మెప్పించారు. రీసెంట్ గా కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన యాక్టింగ్ తో మరోసారి ఓ రేంజ్ లో అలరించారు.
ముఖ్యంగా రిషబ్ శెట్టి తప్ప మరెవరూ బెర్మే రోల్ ను పోషించలేరని అంతా కొనియాడారు. అంతలా తన యాక్టింగ్ తో ఫిదా చేశారు. కచ్చితంగా మరోసారి నేషనల్ అవార్డు అందుకుంటారని అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఓ సర్ప్రైజ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. కాంతార ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి రెండు పాత్రల్లో నటించారు.
ఏంటి షాకయ్యారా.. నిజానికి కాంతార చాప్టర్ 1లో బెర్మే పాత్రలో రిషబ్ యాక్టింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రోల్ తో పాటు కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ లో కనిపించిన మాయావి రోల్ లో కూడా యాక్ట్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియో ద్వారా తెలిపింది. దాంతోపాటు ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంది.
మాయావి పాత్ర మేకప్ వేసుకోవడానికి రోజుకు ఆరు గంటలు పట్టేదని హోంబలే ఫిల్మ్స్ సంస్థ తెలిపింది. మాయావి రోల్ కు సంబంధించిన సీన్స్ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో పొద్దున్న ఆరుకు రిషబ్ వస్తే.. అనేక గంటలపాటు మేకప్ కే సమయం పట్టేదని చెప్పింది. మేకప్ కు సంబంధించిన విజువల్స్ ను వీడియో ద్వారా షేర్ చేసింది.
ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. రిషబ్ శెట్టి డెడికేషన్ మామూలుగా లేదని చెబుతున్నారు. కమిట్మెంట్ సూపర్ అని అంటున్నారు. సినిమా కోసం అంతలా కష్టపడడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. హ్యాట్సాఫ్ రిషబ్ శెట్టి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సినిమాలో మాయావి రోల్ చూసి అసలు రిషబ్ శెట్టి అని అనుకోలేదని చెబుతున్నారు. ఎవరూ కూడా గెస్ చేసినట్లు లేదని అంటున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ టైమ్ లో ఆ విషయాన్ని దాచి ఉంచడం కూడా గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే డ్యూయల్ రోల్ విషయాన్ని చెప్పి బజ్ పెంచే ఛాన్స్ ఉన్నా, యూజ్ చేసుకోలేదని గుర్తు చేస్తున్నారు. డైవర్ట్ చేయడం ఇష్టం లేక అలా చేశారేమో మరి. ఏదేమైనా రిషబ్ శెట్టి డెడికేషన్ కు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాలి.
