బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రిషబ్ మాస్టర్ ప్లాన్.. 'కాంతార' రేంజ్ కలెక్షన్లే టార్గెట్!
`కాంతార` చిత్రంతో ఓవర్ నైట్ గ్లోబల్ స్టార్‌గా మారిన రిషబ్ శెట్టి ప్రణాళికలు ఇప్పుడు సినీపరిశ్రమల్లో చర్చగా మారాయి.
By: Sivaji Kontham | 2 July 2026 4:00 AM IST`కాంతార` చిత్రంతో ఓవర్ నైట్ గ్లోబల్ స్టార్‌గా మారిన రిషబ్ శెట్టి ప్రణాళికలు ఇప్పుడు సినీపరిశ్రమల్లో చర్చగా మారాయి. ఒకే ఒక్క ఫ్రాంఛైజీతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్‌ను పాన్ ఇండియా రేంజుకు చేర్చిన ఘనత అతడిది. కేవలం 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాంతార ప్రీక్వెల్(కాంతార 2), థియేట్రికల్ రన్‌లో ఏకంగా 852 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 2025లో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను అధిగమించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మొదటి భాగం సాధించిన 407.82 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లను ఇది డబుల్ మార్జిన్‌తో బ్రేక్ చేసింది. ఫ్రాంఛైజీలో రెండు సినిమాలతో 1250 కోట్ల రేంజు హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఇదే జోష్‌తో తన తదుపరి హిస్టారికల్ ప్రాజెక్ట్ `ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్` కోసం రిషబ్ ఒక భారీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.
రిషబ్ శెట్టి కేవలం ఒకే భాగంతో ముగించకుండా... ఈ చారిత్రాత్మక కథను రెండు భాగాలుగా (టూ-పార్ట్ సాగా) ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నారని తెలుస్తోంది. `కాంతార` ఫ్రాంఛైజీ తరహాలోనే ఈ రెండు భాగాల స్ట్రాటజీతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయవచ్చని రిషబ్ నమ్ముతున్నారు. శివాజీ మహారాజ్ జీవితంలోని శౌర్యాన్ని, వీరత్వాన్ని ఒకే భాగంలో చూపించడం సాధ్యం కాదు కాబట్టే రిషబ్ స్వయంగా ఈ కథను విస్తరించి భారీ క్యాన్వాస్‌పై రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కేటాయించడం ఒక సంచలనం. విజువల్స్ పరంగా, యాక్షన్ సీక్వెన్స్ పరంగా ఇండియన్ స్క్రీన్‌పై ముందెన్నడూ చూడని భారీతనాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. కథలో వచ్చే అద్భుతమైన ట్విస్టులతో పాటు, అన్ని భాషల ప్రేక్షకులను కనెక్ట్ చేయడానికి వీలుగా పాన్-ఇండియా స్టార్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, షెఫాలీ షా వంటి పవర్‌ఫుల్ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమా రేంజ్‌ను మరింత పెంచింది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ `అమిత్ త్రివేది` సంగీత దర్శకుడిగా యాడ్ అవ్వడం సినిమాకు అతిపెద్ద అసెట్‌గా మారింది. నిజానికి ప్రీతమ్ ని తొలుత ఎంచుకున్నా, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలో అమిత్ త్రివేది చేరారు. ఇక అమిత్ త్రివేది అంటే క్లాస్ ని ఆకట్టుకునే మెలోడీస్ ఇస్తూనే.. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్ట. ప్రసూన్ జోషి పవర్‌ఫుల్ లిరిక్స్‌కు అమిత్ త్రివేది అందించే మ్యూజిక్ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని మేకర్స్ నమ్ముతున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి `కేజీఎఫ్` సిరీస్‌తో రాకింగ్ స్టార్ యష్ ఏ విధంగా గ్లోబల్ వైడ్‌గా షైన్ అయ్యారో.. ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా `కాంతార` ఫ్రాంఛైజీ ` సక్సెస్ తర్వాత మరింత భారీ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాడు. ఇప్పుడు యూనివర్శల్ అప్పీల్ ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్‌తో ఇండియన్ సినిమాపై తన ముద్రను మరింత బలంగా వేయడానికి పక్కా ప్లాన్‌తో దూసుకెళుతున్నాడు.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితకథతో రూపొందించిన `చావా` చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల శివాజీ మహారాజ్ కథతో హిందీ-మరాఠాలో రితేష్ దేశ్ ముఖ్-జెనీలియా దేశ్ ముఖ్ జోడీ రూపొందించిన బయోపిక్ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా కంటే అత్యంత భారీ బడ్జెట్ తో ఇప్పుడు రిషబ్ శెట్టి తన ఫ్రాంఛైజీ సినిమాని అత్యంత భారీగా రూపొందిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. టాప్ క్లాస్ టెక్నీషియన్లు, విజువల్ గ్రాఫిక్స్ (వీఎఫ్ఎక్స్) కోసం ప్రొడక్షన్ టీమ్ భారీగా పెట్టుబడులు పెడుతుండటం చర్చగా మారింది. శివాజీ మహారాజ్ కథను తెరపై గూస్ బంప్స్ తెచ్చేలా ఆవిష్కరించడంపైనే విజయం ఆధారపడి ఉంది.
