Begin typing your search above and press return to search.

అటా...ఇటా..క్లారిటీ ఎప్పుడు?

క‌న్న‌డ స్టార్ రిష‌బ్ శెట్టి `కాంతార` రెండు విజ‌యాల‌తో పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు.

By:  Srikanth Kontham   |   3 Nov 2025 9:00 AM IST
అటా...ఇటా..క్లారిటీ ఎప్పుడు?
X

క‌న్న‌డ స్టార్ రిష‌బ్ శెట్టి `కాంతార` రెండు విజ‌యాల‌తో పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు. `కాంతార చాప్టర్ వ‌న్` ఏకంగా 800 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో రిష‌బ్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడు అన్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు అయింది. దీంతో రిష‌బ్ త‌దుప‌రి ప‌ట్టాలెక్కించే ప్రాజెక్ట్ ఏది అవుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే తెలుగులో `జై హ‌నుమాన్` సీక్వెల్ లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. `హ‌నుమాన్` లుక్ కూడా రిలీజ్ చేసారు. అలాగే బాలీవుడ్ లో `ఛ‌త్ర‌ప‌తి శివాజీ` బ‌యోపిక్లో కూడా నటిస్తున్నాడు. సందీప్ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

మోస్ట్ అవైటెడ్ చిత్రాలే:

ఈ చిత్రానికి సంబంధించి కూడా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ అయింది. హ‌న‌మాన్ పాత్ర‌కు..శివాజీ పాత్ర‌కు రిష‌బ్ ప‌ర్పెక్ట్ గా సూట్ అయ్యాడు. దీంతో ఈ రెండు చిత్రాల‌పై భారీ అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. రెండు పోటా పోటీగా ఉండే చిత్రాలే. దీంతో రిష‌బ్ శెట్టి త‌దుప‌రి ఏ సినిమాను ముందుగా మొద‌లు పెడ‌తాడు? అన్న దానిపై చ‌ర్చ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో రిష‌బ్ శెట్టి భాష‌ల వారిగా ఛాన్స్ తీసుకుంటాడా? అత‌డి నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. `కాంతార` చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం.

క‌న్న‌డిగిపై తెలుగు ప్రేక్ష‌కుల అభిమానం:

టాలీవుడ్ లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అంత పెద్ద స‌క్సెస్ సాధించిందంటే తెలుగు ప్రేక్ష‌కులే కార‌కులు. ఇక్క‌డ సాధించిన విజ‌యంతోనే హిందీలో పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలో `కాంతార చాప్ట‌ర్` ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయ‌గ‌లిగారు. తెలుగు ప్రేక్ష‌కులు అభిమానించారు. తెలుగు స్టార్స్ తో నూ రిష‌బ్ కి మంచి ర్యాపో ఉంది. ఆ ర‌కంగా రిష‌బ్ శెట్టి భావిస్తే ముందుగా `జై హ‌నుమాన్` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంటుంది.

అలా కాని ప‌క్షంలో ఛ‌త్ర‌ప‌తి బ‌యోపిక్ ను సెట్స్ కు తీసుకెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని నెట్టింట నెటిజ‌నులు అంచ‌నా వేస్తున్నారు.

ఏక కాలంలో సాధ్య‌మేనా?

అలా కాకుండా రెండు ప్రాజెక్ట్ లు ఒకేసారి ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంటుందా? అందుకు ఎంత మాత్రం ఛాన్స్ లేదు. రెండు ఆషామాషీ క‌థ‌లు కాదు. ఒకేసారి పూర్తి చేయ‌డం సాధ్యం కానివి. పాత్ర‌ల ప‌రంగా రిష‌బ్ ప్ర‌త్యేకంగా స‌న్న‌ధం కావాల్సి ఉంటుంది. మ్యాక‌ప్ వేసుకోవ‌డానికే గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. బ్యాకెండ్ వ‌ర్క్ మాటల్లో చెప్ప‌లేనిది. అతి పెద్ద భారీ సెట్లు నిర్మించి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు. కాబ‌ట్టి ఏక‌కాలంలో ముంబై టూ హైద‌రాబాద్ తిర‌గ‌డం సాధ్యం కానిదే. మ‌రి దీనిపై రిషబ్ శెట్టి క్లారిటీ ఎప్పుడిస్తాడో చూడాలి.