Begin typing your search above and press return to search.

అంత అడిగితే ఎలా రిష‌బ్?

రిష‌బ్ శెట్టి. కాంతార ఫ్రాంచైజ్ సినిమాల‌తో అత‌ని క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఏ స్థాయిలో పెరిగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Jan 2026 12:21 PM IST
అంత అడిగితే ఎలా రిష‌బ్?
X

రిష‌బ్ శెట్టి. కాంతార ఫ్రాంచైజ్ సినిమాల‌తో అత‌ని క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ ఏ స్థాయిలో పెరిగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌టివ‌ర‌కు క‌న్న‌డలో స్టార్ హీరోగా ఉన్న రిషబ్, కాంతార సినిమాల త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని ప్రముఖ స్టార్ల‌లో రిష‌బ్ శెట్టి కూడా ఒక‌రు. కాంతార సినిమాల త‌ర్వాత అత‌నితో సినిమాలు చేయ‌డానికి అన్ని భాష‌లకు చెందిన నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

తెలుగులో జై హ‌నుమాన్ చేస్తున్న రిష‌బ్

రిష‌బ్ ఇప్ప‌టికే తెలుగులో హ‌ను మాన్ సినిమాకు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న జై హ‌నుమాన్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే రిష‌బ్ తో ఓ ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చేయాల‌ని భావించిన నిర్మాత, ఈ విష‌యంపై రిష‌బ్ ను సంప్ర‌దించ‌గా, ఆ ప్రాజెక్టు కోసం రిష‌బ్ ఏకంగా రూ.70 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ను డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

భారీ రెమ్యూన‌రేష‌న్ కు నిర్మాత ఒప్పుకుంటారా?

అయితే ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ను బ‌ట్టి చూసుకుంటే రిష‌బ్ అడిగిన భారీ మొత్తం ఇవ్వ‌డానికి ఎంత పెద్ద నిర్మాత అయినా త‌ప్ప‌క ఆలోచిస్తారు. మ‌రి రిష‌బ్ ను సంప్ర‌దించిన నిర్మాత ఈ డిమాండ్ ను అంగీక‌రించి సినిమాను ముందుకు తీసుకెళ్తారా లేదా రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఆలోచించి వెన‌క‌డుగు వేస్తారా అనేది చూడాలి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది స్టార్ హీరోలు త‌మ త‌ర్వ‌తి సినిమాల‌కు రెమ్యూన‌రేష‌న్ ల‌ను త‌గ్గించుకుని, సినిమా ఆర్థికంగా ఏ విధంగానూ న‌ష్ట‌పోకుండా ఉండ‌టానికి రిలీజ్ త‌ర్వాత లాభాల్లో షేర్ ను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి టైమ్ లో రిష‌బ్ కేవలం రెమ్యూన‌రేష‌న్ గా గా రూ.70 కోట్లు డిమాండ్ చేస్తే ప్రాక్టిక‌ల్ గా అది జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు.

అయితే ఈ విష‌యంలో ఎవ‌రెన్ని చెప్పినా ఫైన‌ల్ డెసిష‌న్ నిర్మాత‌దే కాబ‌ట్టి, క‌థ‌, దానిపై ఉన్న న‌మ్మ‌కంపైనే ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుందా లేదా అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే గ‌తంలో త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ తో వ‌ర్క్ చేసి, త‌ర్వాత లాభాల్లో షేర్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డే రిష‌బ్, ఇప్పుడు అత‌ని మార్కెట్ పెరగ‌డంతో త‌న రూట్ ను కూడా మార్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి రిష‌బ్ తో టాలీవుడ్ నిర్మాత ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తారో లేదో చూడాలి.