రజనీ, కమల్, చిరు సేమ్ ఫార్ములా!
మన సీనియర్ స్టార్స్ సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని అందించారు.
By: Tupaki Entertainment Desk | 5 Jan 2026 11:39 AM ISTమన సీనియర్ స్టార్స్ సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌ని అందించారు. కల్ట్ క్లాసిక్ సినిమాలని సైతం అందించి ప్రేక్షకుల్ని తమదైన మార్కు మేనరిజమ్స్‌తో మెస్మరైజ్ చేశారు. తమ మేనియాలో ఊగిపోయేలా చేశారు. 70వ దశకం నుంచి ఇప్పటి వరకు తమదైన మార్కు సినిమాలతో సీనియర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి తమదైన ముద్రవేశారు. స్టైల్ యాక్టింగ్‌కి రజనీ, చిరు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే విభిన్నమైన పాత్రలకు, కథలకు కమల్ కేరాఫ్ అయ్యాడు.
గత కొన్ని దశాబ్దాలుగా సోలోగా అద్భుతాలు సృష్టించిన ఈ స్టార్స్ ఇప్పుడు కొత్త ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుండటంతో అదే కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఒక్కో సారి ఆ ఫార్ములా బెడిసికొట్టినా సరే దాన్నే నమ్ముకుంటున్నారు. అదే కో స్టార్ ఫార్ములా. 12 ఏళ్లకు పైనే వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` మూవీతో సరికొత్త ఫార్ములాని ఫాలో కావడం మొదలు పెట్టాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి రజనీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించిన సినిమాగా నిలిచింది.
ఇందులో రజనీ హీరోగా నటిస్తే తనకు సపోర్ట్‌గా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించారు. వీరిద్దరు దీనికి ప్లస్‌గా మారి మరింత క్రేజ్‌ని తెచ్చి పెట్టారు. ఇదే ఫార్ములాని `వెట్టయాన్`కు కూడా ఫాలో అయ్యారు. ఇందులో రానా విలన్‌గా నటించగా, కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ కనిపించారు. భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఫరవాలేదు అనిపించింది. `కూలీ` పరిస్థితి కూడా అంతే.. విలన్‌గా నాగార్జున కనిపించగా, కీలక అతిథి పాత్రల్లో ఆమీర్‌ఖాన్, ఉపేంద్ర కనిపించి ఆకట్టుకున్నారు. `జైలర్ 2`లో మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లతో పాటు షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. తలైవర్ 173లోనూ క్రేజీ స్టార్లు కనిపించే అవకాశం ఉందని ఇన్‌సైడ్‌టాక్.
ఇక మరో సీనియర్ స్టార్ కమల్ హాసన్ ది ఇదే దారి. `విక్రమ్`తో మళ్లీ విజయాల బాట పట్టిన కమల్ అప్పటి నుంచి అదే పంథాని అనుపరిస్తున్నాడు. `విక్రమ్`లో సూర్య గెస్ట్ క్యారెక్టర్‌లో కనిపించగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. దీని తరువాత కమల్ `ఇండియన్ 2`లో సిద్ధార్ధ్ కనిపించగా, `థగ్ లైఫ్`లో శింబు నటించడం తెలిసిందే. ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు డైరెక్టర్స్‌గా KH237ని చేస్తున్న కమల్ ఈ మూవీకి కూడా ఇదే ఫార్ములాని వాడబోతున్నాడు.
ఇక చిరు కూడా 'సైరా నరసింహారెడ్డి' నుంచి ఇదే ఫాలో అవుతున్నాడు. ఇందులోని కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి, సుదీప్ నటించడం తెలిసిందే. ఫలితం ఎలా ఉన్నా ఇప్పటికీ చిరు దీన్నే ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నాడు. 'ఆచార్య'లో రామ్‌చరణ్‌తో నటించగా, 'గాడ్ పాదర్'లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించడం తెలిసిందే. ఇక 'వాల్తేరు వీరయ్య'లో మాస్ మహారాజా రవితేజతో కలిసి సందడి చేశాడు. ఇది మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు'లోనూ వెంకీని రంగంలోకి దించడం తెలిసిందే. ఇక బాబి కొల్లి డైరెక్షన్‌లో చిరు 158 మూవీలో మోహన్ లాల్ కీలక గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ. ఇలా రజనీ నుంచి చిరు వరకు సీనియర్స్ తమ సినిమాల్లో సపోర్టింగ్ స్టార్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ సక్సెస్ కోసం సరికొత్త ఫార్ములాని ఫాలో అవుతుండటం గమనార్హం.
