ట్యాలెంట్ లేని హీరో... హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హిందీ బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న నటి రిమీ సేన్ తాజాగా హీరో జాన్ అబ్రహంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
By: Ramesh Palla | 24 Jan 2026 3:00 PM ISTహిందీ బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న నటి రిమీ సేన్ తాజాగా హీరో జాన్ అబ్రహంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జాన్ అబ్రహంతో ఈమె గతంలో కలిసి నటించింది. ఇండస్ట్రీలో కొన్నాళ్లు బిజీగానే సినిమాలు చేసిన ఈమె ఈ మధ్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ దుబాయ్‌లో జీవితంను సాగిస్తోంది. దుబాయ్‌లో ఈమె ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంట్‌గా జీవితాన్ని సాగిస్తున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇలా సినిమాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, ఇంటర్వ్యూలు ఇస్తూ ఇండస్ట్రీ వారి గురించి మాట్లాడటం చేస్తూ ఉంటుంది. గతంలో బిగ్ బాస్ షో ఒక పనికిమాలిన షో అంటూ తీవ్రంగా విమర్శించింది. కేవలం పారితోషికం ఇస్తాను అంటే మాత్రమే ఆ షో కి వెళ్లాను, టాస్క్ లు చేస్తున్న సమయంలో నరకం కనిపించేదని రిమీ సేన్ చెప్పుకొచ్చింది.
జాన్ అబ్రహం పై విమర్శలు..
తాజాగా జాన్ అబ్రహం గురించి ఈమె మాట్లాడుతూ... జాన్ అబ్రహం ఎప్పుడూ తన లిమిట్స్‌లో సినిమాలను చేస్తూ ఉంటాడు. ఆయనకు నటన రాదు అనే విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయన ఎక్కువగా బాడీ చూపిస్తూ, కండలు చూపిస్తూ, ఫిజిక్ ను ఎక్స్‌పోజ్ చేసే వీలు ఉండే విధంగా యాక్షన్ సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. నటన రాకున్నా కేవలం యాక్షన్ సినిమాలు చేస్తూ కండలు చూపిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తున్నాడు. నటన రాదు కనుకే ఎప్పుడూ గంభీరంగా కనిపించే విధంగా ఉండాలని సీరియస్ కథలు ఎంపిక చేసుకుంటాడు. ఆయన కనీసం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వలేడని రిమీ సేన్ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అతడి సినిమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన నటన ప్రతిభ ఏంటో అర్థం అవుతుంది అన్నట్లుగా రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
రిమీ సేన్ ఇంటర్వ్యూ వైరల్..
గతంలో జాన్ అబ్రహంకి రిమీ సేన్ కి మధ్య చిన్న వివాదం నెలకొంది. ఆ వివాదం కారణంగానే ఇలా జాన్ అబ్రహం గురించి తీవ్రంగా విమర్శిస్తూ తాజా ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేసింది అనేది కొందరి ఆరోపణ. ఆ విషయం పక్కన పెడితే రిమీ సేన్ చేసిన వ్యాఖ్యలను కొందరు బాలీవుడ్ వర్గాల వారు తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఉంటు, స్టార్ డం దక్కించుకుని, తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో గురించి ఇలాగేనా మాట్లాడేది అంటూ చాలా మంది ఆమె తీరును విమర్శిస్తున్నారు. రిమీ సేన్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్‌గా మారిందని, ఆమె పబ్లిసిటీ కోసం చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొందరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందా అనేది చూడాలి.
జాన్ అబ్రహం కి నటన రాదు..
గతంలోనూ ఈమె దర్శకుడు రోహిత్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈయన నల్లజాతి ఆఫ్రికన్ అమ్మాయిని, అబ్బాయిని కూడా చాలా అందంగా చూపించగలరు అంటూ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి వివాదాస్పదం అయింది. ఇక తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను సైతం రిమీ సేన్ కొట్టి పారేసింది. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా అవాస్తవం అన్నట్లుగా కొట్టి పారేసింది, అంతే కాకుండా తాను ఫేస్ లో మార్పుల కోసం కేవలం పిల్లర్స్, బొటాక్స్, చిన్న ట్రీట్‌మెంట్ చేసుకున్న మాట వాస్తవం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసులోనూ చాలా అందంగా కనిపించే రిమీ సేన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఫోటోలతో పాటు, అప్పుడప్పుడు ఈమె ఇలాంటి వ్యాఖ్యలతోనూ వైరల్ కావడం మనం చూస్తూ ఉన్నాం. సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా అనే అనుమానాలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
