Begin typing your search above and press return to search.

రిహానా లగ్జరీ లెవెల్.. బ్రాస్ లెట్ ధర తెలిస్తే షాక్!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ ఇచ్చే గిఫ్ట్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  Madhu Reddy   |   21 Jun 2026 12:00 AM IST
రిహానా లగ్జరీ లెవెల్.. బ్రాస్ లెట్ ధర తెలిస్తే షాక్!
X

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అంబానీ ఫ్యామిలీ ఇచ్చే గిఫ్ట్‌లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా గ్లోబల్ పాప్ సింగర్ రిహానా తనకు అంబానీ కుటుంబం ఇచ్చిన ఒక రేర్ గిఫ్ట్‌ను ప్రపంచానికి చూపించి అందరికీ లగ్జరీ లెవెల్ షాక్ ఇచ్చింది. తన చేతికున్న ఒక మెరిసే డైమండ్ టెన్నిస్ బ్రేస్‌లెట్‌ను చూపిస్తూ, ఇది నాకు ఇండియాలో అంబానీలు ఇచ్చారంటూ ఆమె రీసెంట్‌గా రివీల్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

ముంబై ట్రిప్‌లో అంబానీలతో స్పెషల్ బాండింగ్:

ఇటీవల రిహానా తన బ్యూటీ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన ఒక లంచ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని భారతీయ సంప్రదాయాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదించింది. ఇక అంతకుముందు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆమె ఏకంగా రూ. 70 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఈవెంట్స్ టైమ్‌లోనే అంబానీలు ఆమెకు ఈ ఖరీదైన కానుకను ఇచ్చారుట.

స్ట్రీట్ స్టైల్ ఇంటర్వ్యూలో రివీల్ చేసిన రిహానా:

తాజాగా జరిగిన స్ట్రీట్ స్టైల్ ఇంటర్వ్యూలోఆమె తన అవుట్ ఫిట్ గురించి తెలిపారు. ఆ రోజు స్టైలిష్ డెనిమ్ అవుట్‌ఫిట్‌తో పాటు రోలెక్స్ వాచ్, వింటేజ్ డైమండ్ బ్రేస్‌లెట్స్, మెడలో డైమండ్ నెక్లెస్ వంటి ఎన్నో లగ్జరీ జ్యువెలరీలను వేసుకుంది.ఇక కెమెరా ముందుకు తన చేతిని చాపి, "ఇది నాకు ఇండియాలో అంబానీలు ఇచ్చారు" అంటూ ఆ మెరిసే డైమండ్ బ్రేస్‌లెట్‌ను గర్వంగా చూపించింది.

ఆ బ్రేస్‌లెట్ విలువ అక్షరాలా రూ. 2.2 కోట్లు:

ఇక ఈ సింపుల్, ఎలిగెంట్ అండ్ టైమ్‌లెస్ డిజైన్‌తో ఉన్న బ్రేస్‌లెట్ విలువ మార్కెట్లో దాదాపు రూ. 2.2 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఎప్పటికీ ఓల్డ్ అవ్వని ఈ ఐకానిక్ డిజైన్‌ను రిహానాకు గిఫ్ట్‌గా ఇవ్వడం అంబానీల రాయల్ టేస్ట్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడమే కాకుండా, అంబానీల దగ్గర నుండి ఇలా రూ. 2.2 కోట్ల విలువైన డైమండ్ గిఫ్ట్ అందుకోవడం కేవలం రిహానా లాంటి గ్లోబల్ ఐకాన్‌కే సాధ్యమేమో, ఇక ఏదేమైనా ఇండియా ట్రిప్ ముగిసినా అంబానీలు ఇచ్చిన ఈ మెరిసే కానుకను రిహానా అంతర్జాతీయ వేదికలపై ఇంతలా ఫ్లాంట్ చేయడం చూస్తుంటే వారి మధ్య ఉన్న బాండింగ్ ఎంత స్ట్రాంగో అర్థమవుతోంది.