రూమర్స్ కి చెక్ పెట్టిన రణబీర్ సోదరి.. అందరికీ ఆమోదమే అంటూ క్లారిటీ!
బాలీవుడ్ ప్రముఖ నటుల జాబితాలో కపూర్ ఫ్యామిలీ కూడా ముందుంటుంది.ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుండి దిగ్గజ నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
By: Madhu Reddy | 7 Aug 2025 11:00 PM ISTబాలీవుడ్ ప్రముఖ నటుల జాబితాలో కపూర్ ఫ్యామిలీ కూడా ముందుంటుంది.ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుండి దిగ్గజ నటులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అలాంటి వారిలో ప్రస్తుత జనరేషన్లో రణబీర్ కపూర్ ఉన్నారు.. నీతూ కపూర్ , రిషి కపూర్ ల కొడుకే రణబీర్ కపూర్.. అయితే రణబీర్ కపూర్ కి సోదరి రిద్ధిమా కపూర్ కూడా ఉన్నారు. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతుంటే రిద్ధిమా కపూర్ మాత్రం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే చాలా రోజుల నుండి కపూర్ ఫ్యామిలీ సినిమాల్లోకి తమ కూతుర్లను హీరోయిన్ గా పంపరు అనే ఒక రూమర్ ఉంది.
అంతేకాదు రిద్ధిమా కపూర్ సినిమాల్లోకి హీరోయిన్ గా వద్దామనుకుంటే రిషి కపూర్ ఆమెకు సినిమాల్లోకి వద్దు అనే కఠినమైన రూల్ పెట్టినట్టు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది రిద్ధిమా కపూర్. ఆమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను సినిమాల్లోకి వస్తే వద్దని నాన్న కండిషన్ పెట్టినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.అవన్నీ నిరాధారమైన పుకార్లు మాత్రమే. నేను చదువు పూర్తయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ ని ఎంచుకున్నాను. అందుకే నాకు సినిమాల్లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు కలగలేదు. అంతేకానీ సినిమాల్లోకి వస్తానంటే మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు" అంటూ క్లారిటీ ఇచ్చింది రిద్ధిమా కపూర్.
అయితే రిద్ధిమా కపూర్ ప్రస్తుతం తన 44 ఏళ్ల వయసులో 'దాదీ కీ షాదీ' అనే మూవీతో ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో రిద్ధిమా కపూర్ తల్లి నీతూ కపూర్ కూడా నటిస్తోంది. అలాగే ఇందులో కపిల్ శర్మ కూడా నటిస్తున్నారు. ఇక దాదీ కీ షాదీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ జానర్లో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్న రిద్ధిమా కపూర్ తన 44 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వస్తానంటే కుటుంబం మొత్తం సపోర్ట్ చేసిందట. కుటుంబం ఇచ్చిన సపోర్ట్ తో చాలా ఉత్సాహంగా ఈ సినిమాని ఒప్పుకున్నట్టు రిద్ధిమా కపూర్ తెలియ జేసింది. తాను సినిమాల్లోకి రావడానికి తన వదిన అలియా భట్ తో సహా తన కుటుంబం మొత్తం ఎంతో సపోర్ట్ చేసిందని,వారి సపోర్ట్ తోనే తాను సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్టు రిద్ధిమా కపూర్ తెలియజేసింది. ప్రస్తుతం రిద్ధిమా కపూర్ మాట్లాడిన మాటలు బీ టౌన్ లో వైరల్ గా మారాయి.
