ఆ బ్యూటీ మరాఠీకి వెళ్లిపోతుందా?
ముంబై బ్యూటీ రిద్దీ కుమార్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లవర్' ,' అనగనగా ఓ ప్రేమ కథ'లో హీరోయిన్ గా నటించింది.
By: Srikanth Kontham | 12 Jan 2026 7:00 PM ISTముంబై బ్యూటీ రిద్దీ కుమార్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లవర్' ,' అనగనగా ఓ ప్రేమ కథ'లో హీరోయిన్ గా నటించింది. అటుపై 'రాధేశ్యామ్' లో కీలక పాత్రలో కనిపించింది. కానీ ఈ సినిమాలేవి కూడా రిద్దీ కుమార్ కు కలిసి రాలేదు. కెరీర్ పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు కనిపించింది. బాలీవుడ్ సహ మరాఠీలోనూ అదే పరిస్థితి. రెండు మూడు సినిమాలు చేసింది అనే పేరు తప్పా అక్కడా ఏనాడు బిజీ కాలేదు. సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు మారుతి రిద్దీ కుమార్ లో ప్యూచర్ హీరోయిన్ ని చూసాడు.
దీంతో మరో ఆలోచన లేకుండా పాన్ ఇండియా చిత్రం ''ది రాజాసాబ్'' లో ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫలితం తెలిసిందే. రిద్దీ కుమార్ పాత్రపై ఎలాంటి పీడ్ బ్యాక్ వచ్చిందో కూడా తెలిసిందే. కానీ ఈ సినిమాపై రిద్దీ కుమార్ మాత్రం రిలీజ్ కు ముందు చాలా ఆశలు పెట్టుకుంది. విజయంతో టాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంది. ఇంకా ఎన్నో కలలు కంది. నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలి..తొలి సారి జరిగిన తప్పిదాలు రిపీట్ అవ్వకుండా కెరీర్ ముందుకు సాగించాలని ఓ ప్రణాళిక సిద్దం చేసి పెట్టుకుంది.
కానీ 'రాజాసాబ్' వైఫల్యం అన్నింటిని తారు మారు చేసేసింది. ప్లాప్ టాక్ తో ప్లానింగ్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. ఈ సినిమాకు వచ్చిన టాక్ తో అందులో నటించిన మిగతా ఇద్దరు హీరోయిన్లకు కూడా అవకాశాలు రావడం కష్టమా? అన్న సందేహం రాకమానదు. ఇక రిద్దీ కుమార్ సంగతి చూస్తే? అప్పటి టాలీవుడ్ నుంచి దుకాణం సర్దేసినట్లు తెలుస్తోంది. రూమ్ వెకెట్ చేసి ముంబైకి వెళ్లిపోయిందిట. ఇకపై నటిగా ప్రయాణం సొంత భాషలోనే చేయాలనుకుంటుందిట. ఈ క్రమంలో అమ్మడు మళ్లీ మరాఠీలో రీలాంచ్ అయ్యే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరేళ్ల క్రితమే రిద్దీ కుమార్ మరాఠీలో లాంచ్ అయింది. కానీ ఆ తర్వాత సినిమాలు కంటున్యూ చేయలేదు. ఇతర భాషల్లో అవకాశాలు రావడంతో మాతృభాషను లైట్ తీసుకుంది. కానీ గత ఏడాది మాత్రం ఓ సినిమా చేసింది. ఈలోగా రాజాసాబ్ బిజీలో పడి వచ్చిన అవకాశాలు కూడా వదులకుంది. ఈ నేపథ్యంలో పోయిన అవకాశాలు అందింపుచ్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్నా? టైమ్ వేస్ట్ తప్ప అవకాశాలివ్వరని అమ్మడు కూడా ఓ స్ట్రాంగ్ డెసిషన్ కు వచ్చేసినట్లు తెలుస్తోంది.
