రాజాసాబ్ బ్యూటీ వీపందం
తాజాగా రిద్ధి బ్యాక్ లెస్ ఫోజ్ తో గుబులు పెంచుతోంది. డార్క్ నేవీ బ్లూ ఫ్రాక్ ధరించిన రిద్ది కుమార్ చురుకైన చూపులతో గుండె గుల్ల చేస్తోంది.
By: Sivaji Kontham | 25 Dec 2025 8:30 AM ISTక్యూట్ లుక్స్, చిక్లెట్ చిక్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పెంచుతోంది ఈ బ్యూటీ. రాజాసాబ్ చిత్రంతో తన లక్ చెక్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న ఈ క్యూట్ బ్యూటీ పేరు రిద్ధి కుమార్. చెన్నై కి చెందిన ఈ క్యూటీ ఇంతకుముందు `లవర్` అనే చిత్రంతో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం `రాజాసాబ్` తన కెరీర్‌కి బిగ్ బ్రేక్ నిస్తుందని రిద్ధి కుమార్ ఆశిస్తోంది.
ఇటీవలి `రాజా సాబ్`కి సోషల్ మీడియాలలో ప్రచారం కల్పిస్తూ, రిద్ధి రెచ్చిపోతోంది. ముఖ్యంగా తన స్వస్థలం చెన్నైలో రాజా సాబ్ కి బోలెడంత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకుముందు పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో రిద్ధి సందడి చాలా హుషారెత్తించింది. వేదికపై ఎందరు ఉన్నా రిద్ధి ముందు నిలబడలేకపోయారంటే తన సందడి ఏ రేంజులో ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. రిద్ధి కుమార్ ఇటీవల సోషల్ మీడియా సంచలనంగా అందరి హృదయాల్లో నిలిచి ఉంది. తనకు విపరీతమైన హైప్ లేకపోయినా కానీ, తన లుక్స్, గట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది.
ముఖ్యంగా `రాధే శ్యామ్` తర్వాత ప్రభాస్‌తో రెండోసారి కలిసి నటిస్తోంది. ఇది తనకు స్వస్థలం చెన్నైలోను క్రేజ్ పెంచుతోంది. భారతదేశంలోని బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ సరసన రిద్ధి కపూర్ ఆవకాశాలు అందుకుంటోంది. రాజా సాబ్‌లో మెయిన్ స్ట్రీమ్ నాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటించినా కానీ, రిద్ధి కూడా ప్రభావవంతమైన పాత్రతో ఆకట్టుకోనుందని తెలిసింది.
తాజాగా రిద్ధి బ్యాక్ లెస్ ఫోజ్ తో గుబులు పెంచుతోంది. డార్క్ నేవీ బ్లూ ఫ్రాక్ ధరించిన రిద్ది కుమార్ చురుకైన చూపులతో గుండె గుల్ల చేస్తోంది. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది. ఒక్కో సినిమాతో గ్లామర్ ప్రపంచంలో తన కెరీర్ రన్ ని మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ చెన్నై చంద్రానికి ఆల్ ది బెస్ట్ చెబుతోంది తెలుగు యూత్.
