Begin typing your search above and press return to search.

సమ్మర్ వేళ హీట్ పుట్టిస్తున్న ప్రభాస్ బ్యూటీ!

సీజన్ కి తగ్గట్టుగా ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు సెలబ్రిటీలు.

By:  Madhu Reddy   |   8 March 2026 11:20 PM IST
సమ్మర్ వేళ హీట్ పుట్టిస్తున్న ప్రభాస్ బ్యూటీ!
X

సీజన్ కి తగ్గట్టుగా ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా అకౌంట్ ఉంటే చాలు తమ అందాలు ఆరబోస్తూ.. అటు దర్శక నిర్మాతల కంట్లో కూడా పడుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు . పైగా పబ్లిక్ ఈవెంట్లలో, సినిమా ఫంక్షన్లలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మలు. అందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తమ ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు మంచి అందాల ట్రీట్ ఇస్తున్నారని చెప్పాలి.




ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ బ్యూటీగా పేరు దక్కించుకున్న రిద్ధీ కుమార్.. ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతున్నాయి. హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ లెహంగా ధరించిన ఈమె.. ముత్యాలతో అద్భుతంగా రూపొందించిన ఈ డ్రెస్. తన మేనిఛాయతో అందాలు ఒలకబోస్తూ ప్రేక్షకులను మరింత మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా నెక్ ను గ్రీన్ కలర్ స్టోన్ చైన్ తో ఫుల్ ఫిల్ చేసింది. మొత్తానికైతే రిద్దీ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది అనడంలో సందేహం లేదు. తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ సమ్మర్ వేళ మరింత హీట్ పుట్టిస్తుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




ఇకపోతే తాజాగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఈవెంట్ కి హాజరైన ఈమె. అక్కడ వివిధ రంగాలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అవార్డులు అందుకున్న మహిళలను కలిసినందుకు తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అంటూ క్యాప్షన్ గా రాసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రిద్దీ కుమార్ షేర్ చేసిన ఈ ఫోటోలు, ఇచ్చిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




మహారాష్ట్రలోని షిర్డి సమీపంలో ఉన్న కోపర్గావ్ ప్రాంతంలో ఒక సైనిక కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి భారత సైన్యంలో అధికారి కాగా, ఈమె పూణేలోని ఫెర్గ్యూసన్ కళాశాల నుండి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకుంది. సినిమాలోకి రాకముందు మోడల్ గా పనిచేసిన ఈమె.. పలు ఫ్యాషన్ షోలు , ప్రాంతీయ అందాల పోటీల్లో పాల్గొనింది. 2018లో రాజ్ తరుణ్ సరసన లవర్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత విరాజ్ అశ్విని సరసన అనగనగా ఓ ప్రేమ కథలో కనిపించింది.

ఇకపోతే ప్రసిద్ధ క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్ లో కూడా కనిపించిన రిద్ధీ ఇటీవల ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఇందులో రిద్ధీ తో పాటు నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ కూడా నటించిన విషయం తెలిసిందే. అటు టెలివిజన్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది రిద్ధీ కుమార్.