Begin typing your search above and press return to search.

వీడియో: స‌ముద్ర ఇసుక‌లో తూనీగ విన్యాసాలు

బాలీవుడ్ భామ రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఇటీవ‌ల బిజీగా గ‌డుపుతోంది. తాజాగా ఈ యువ‌న‌టి షేర్ చేసిన వీడియోలో సముద్రపు ఇసుకలో సరదాగా సందడి చేస్తూ కనిపించింది.

By:  Sivaji Kontham   |   3 March 2026 10:40 AM IST
వీడియో: స‌ముద్ర ఇసుక‌లో తూనీగ విన్యాసాలు
X

బాలీవుడ్ భామ రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఇటీవ‌ల బిజీగా గ‌డుపుతోంది. తాజాగా ఈ యువ‌న‌టి షేర్ చేసిన వీడియోలో సముద్రపు ఇసుకలో సరదాగా సందడి చేస్తూ కనిపించింది. ముఖ్యంగా బాడీ హగింగ్ ఇన్నర్ వేర్‌లో రియా కనిపిస్తున్న తీరు నెటిజన్ల మతి పోగొడుతోంది. సముద్రపు అలల మధ్య, సూర్యాస్తమయ వేళ తీరిక స‌మ‌యాన్ని ఆస్వాధిస్తున్న‌ రియా పంచుకున్న ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ , కాన్ఫిడెన్స్ చూస్తుంటే కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.




రియాకు సముద్రం అంటే ఎందుకు అంత పిచ్చి? అనే ప్రశ్న మెదులుతోంది. దానికి సమాధానంగా రియా ఒక అంద‌మైన వ్యాఖ్య‌ను ఈ ఫోటోషూట్ కి జోడించింది. `గ్రాటిట్యూడ్ అండ్ సన్‌సెట్స్` (కృతజ్ఞత మరియు సూర్యాస్తమయాలు) అంటూ పోస్ట్ పెట్టింది. ప్రకృతి ఒడిలో ముఖ్యంగా సముద్ర తీరాన గడపడం వల్ల కలిగే ప్రశాంతత త‌న‌కు ఎంతో ఇష్టం. అందుకే షూటింగ్‌లకు విరామం దొరికినప్పుడల్లా సముద్రపు హోరును వినడానికి అక్కడి ఇసుకలో ఆడుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. సముద్రం రియాకు కొత్త శక్తిని ఇస్తుందని చెప్పకనే చెబుతోంది.




ఈ పోస్ట్‌ ద్వారా రియా ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. నేటి కాలంలో అందరూ నిరంతరం పరుగు తీస్తూనే ఉంటారు.. కష్టపడటం, పనిలో నిమగ్నం కావడం మంచిదే అయినా, అప్పుడప్పుడు విరామం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అని అంటోంది. `జీవితం అంటే ఇప్పుడే` అని నమ్ముతోంది. సూర్యుడిని ఆస్వాధిస్తూ ఒక రోజు సెలవు తీసుకోవడంలో తప్పులేదని తన అభిమానులకు గుర్తు చేస్తోంది.

రియా షేర్ చేసిన ఈ వీడియోపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ భామ ఎంపిక‌చేసుకున్న డిజైన‌ర్ లుక్ ఎంతో కళాత్మకంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ క్లాసీగా ఉంటావు బంగారం! అంటూ ఆమె స్టైల్‌ను మెచ్చుకుంటున్నారు. గ్లామర్ విందు ఎంత ఉన్నా.. అందులో ఒక హుందాతనం, కళాత్మకత ఉందంటూ ఫాలోవ‌ర్స్ హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

రియా ప్రస్తుతం తన జీవితంలో `స్లో లైఫ్` (నిదానమైన జీవితం) సూత్రాన్ని పాటిస్తోంది. హడావుడి లేని, ఒత్తిడి లేని జీవితం తనను మానసికంగా నయం చేస్తుందని నమ్ముతోంది. అందుకే తనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ.. ప్రకృతిని ప్రేమిస్తూ గడుపుతోంది. గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి బయటపడి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకుని ఎంతో సంతోషంగా కనిపిస్తోంది.

మొత్తానికి రియా చక్రవర్తి తన గ్లామర్ లుక్స్‌తోనే కాకుండా.. తన ఆలోచనలతో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. సముద్రపు తీరాన ఈ భామ‌ చేస్తున్న ఈ విన్యాసాలు ఒకవైపు కనువిందు చేస్తుండగా.. మరోవైపు జీవితంపై త‌న‌కు ఉన్న సానుకూల దృక్పథం చర్చనీయాంశంగా మారింది. రియా మరిన్ని ప్రాజెక్టులతో అలరించడానికి సిద్ధమవుతోంది.