Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఘ‌ట‌న‌పై రాంగోపాల్ వ‌ర్మ మౌనం!

ఎలాంటి సమకాలీన అంశమైనా, రాజకీయ వివాదమైనా సెలబ్రిటీలకంటే ముందే తనదైన శైలిలో ఘాటు స్పందనలు, వివాదాస్పద ట్వీట్లు ఇచ్చే వర్మ..

By:  Srikanth Kontham   |   26 July 2026 5:00 PM IST
ఢిల్లీ  ఘ‌ట‌న‌పై రాంగోపాల్ వ‌ర్మ మౌనం!
X

నీట్ ప‌రిక్షా ప‌త్రం లీక్ అయిన నేప‌థ్యంలో విద్యార్దుల నిర‌స‌న ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. విద్యార్దుల నిర‌స‌న‌తో చివ‌రికి మోదీ ప్ర‌భుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. కొన్ని గంట‌ల క్రితం వ‌ర‌కూ ఢిల్లీ ఎలా అట్టుడికిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఘ‌ట‌న‌పై టాలీవుడ్ త‌ప్ప దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లు స్పందించాయి. స్టార్ హీరోలంతా విద్యార్దుల నిర‌స‌న‌కు స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

చిన్న చిన్న న‌టీన‌టులైతే ఏ కంగా విద్యార్దుల కోసం జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు చేరుకుని నిర‌స‌న తెలియ‌జేసారు. అయితే ఈ ఘ‌ట‌పై సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ కూడా మౌనం వ‌హించ‌డం అంతి పెద్ద సంచ‌ల‌నం అవుతుంది. ఎక్కడ ఏ వివాదం జరిగినా? ఏ సామాజిక అంశం తెరపైకి వచ్చినా సోషల్ మీడియా వేదికగా ముందుగా స్పందించేది రాంగోపాల్ మాత్ర‌మే. కానీ ఈసారి వర్మ పూర్తిగా మౌనం వహించడం ప‌రిశ్ర‌మ‌లోనే కాదు ప్రేక్ష‌కుల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎలాంటి సమకాలీన అంశమైనా, రాజకీయ వివాదమైనా సెలబ్రిటీలకంటే ముందే తనదైన శైలిలో ఘాటు స్పందనలు, వివాదాస్పద ట్వీట్లు ఇచ్చే వర్మ.. జంతర్ మంతర్ ఘటనపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు పరిణామాలపై స్పందించ‌గా ఆర్జీవీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కొంతకాలంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా లో స్పందించే తీరును పూర్తిగా మార్చుకున్నట్లు క‌నిపిస్తుంది. గతంలో ప్రతి చిన్న అంశానికి వివాదాస్పద పోస్టులు పెడుతూ నిత్యం వార్త‌ల్లో నిలిచిన ఆయన కొంత‌ కాలంగా సమకాలీన రాజకీయ .. సామాజిక అంశంపై కూడా పెద్దగా స్పందించడం లేదు. వివాదాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితం అవుతున్నారు. పరిశ్రమలో ఎవరికీ భయపడకుండా మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే వర్మ ఇలా సైలెంట్ అయిపోవడానికి అసలు కారణం ఏంట‌నే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజులుగా వ‌ర్మ‌ వ్యక్తిగత పనుల నేపథ్యంలోనే వ‌ర్మ సోషల్ మీడియా జోక్యానికి పూర్తిగా బ్రేక్ వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా? సోషల్ మీడియాలో నిత్యం సంచలనాలు సృష్టించే రాంగోపాల్ వర్మ ఇలాంటి కీలకమైన సమయాల్లో మౌనం వహించడం ఆయన్ని అభిమానించే వారితో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుడికి విస్మయం కలిగిస్తోంది. మ‌రి భవిష్యత్తులో వ‌ర్మ మ‌ళ్లీ సాధారణ శైలికి మళ్లీ వస్తారా లేక‌ ఇదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తారా ? అన్న‌ది చూడాలి.