ఎప్పటికీ మర్చిపోలేని సినిమా: సందీప్ వంగా
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఇలా వరస విజయాలతో సందీప్ రెడ్డి వంగా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన దర్శకులలో ఒకరిగా మారాడు.
By: Sivaji Kontham | 2 Nov 2025 5:21 PM ISTఅర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఇలా వరస విజయాలతో సందీప్ రెడ్డి వంగా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన దర్శకులలో ఒకరిగా మారాడు. అతడు ఎంపిక చేసుకునే కంటెంట్, పాత్రల చిత్రణ, పాత్రధారుల రిలేషన్ షిప్స్ లో ఘాడమైన ఇంటెన్సిటీ అతడికి గొప్ప గుర్తింపును తెచ్చి పెట్టాయి.
తనను విమర్శించే ఒక సెక్షన్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్నా కానీ, అంతిమంగా ప్రజలందరూ అతడి సినిమాలను ఆదరిస్తున్నారు. దీనిని బట్టి మెజారిటీ ప్రజల హృదయాలను అతడు గెలుచుకున్నాడని నిరూపణ అయింది. ప్రస్తుతం సందీప్ వంగా ప్రభాస్‌తో `స్పిరిట్` కోసం పని చేస్తున్నాడు. 2026-27 సీజన్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రంగా `స్పిరిట్` గురించి చాలా చర్చ జరుగుతోంది.
అయితే సందీప్ రెడ్డి వంగా సినిమాలు అన్ని రకాల మసాలా అంశాలతో ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కమర్షియల్ సినిమాల కింగ్ గా మారిన సందీప్ ని ప్రభావితం చేసిన సినిమా ఏది? అన్న ప్రశ్న వేస్తే, దీనికి అతడే స్వయంగా జవాబిచ్చాడు. తనను అత్యంత ప్రభావితం చేసిన సినిమాలలో `శివ` ఒకటి. ఆర్జీవీ తెరకెక్కించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ప్రభావం తనపై చాలా ఎక్కువగా ఉందని అన్నాడు సందీప్. శివ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన వీడియోలో సందీప్ వంగా మాట్లాడుతూ.. పై విషయాలను ప్రస్థావించారు. నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `శివ` సోషియో పొలిటికల్ డ్రామాతో మ్యూజికల్ హిట్ చిత్రంగా నిలిచింది.
