Begin typing your search above and press return to search.

బ‌హుబ‌లి త‌ర్వాత వేరే ఏ చిత్రానికి విన‌లేదు: ఆర్జీవీ

తేజ స‌జ్జా `మిరాయ్` బాక్సాఫీస్ మిరాకిల్స్ తో దూసుకుపోతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. స‌మీక్ష‌కులు ఈ సినిమాని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

By:  Sivaji Kontham   |   13 Sept 2025 3:59 PM IST
బ‌హుబ‌లి త‌ర్వాత వేరే ఏ చిత్రానికి విన‌లేదు: ఆర్జీవీ
X

తేజ స‌జ్జా `మిరాయ్` బాక్సాఫీస్ మిరాకిల్స్ తో దూసుకుపోతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. స‌మీక్ష‌కులు ఈ సినిమాని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్రేక్షకుల నుండి నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై త‌న అభిప్రాయాన్ని సోషల్ మీడియా లో షేర్ చేసారు.

ఇండస్ట్రీ హిట్ అందించినందుకు తేజ స‌జ్జా-కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని-విశ్వ‌ప్ర‌సాద్ ల‌కు లకు పెద్ద షాట్.. బాహుబలి తర్వాత నేను మరే ఇతర చిత్రానికి మిరాయ్ కి వ‌చ్చిన‌ట్టు ఇంతటి ఏకగ్రీవ ప్రశంసలు వినలేదు.. VFX-సినిమా కథనం రెండూ హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.. అని ప్ర‌శంసించారు.

ఆర్జీవీ వ్యాఖ్య‌ల‌తో నెటిజ‌నులు కూడా ఏకీభవించారు. అవును నిజమే ఇది హాలీవుడ్ స్థాయి అని రాసారు. మిరాయ్ అత్యుత్తమ చిత్రం.. అందరు నటీనటులు అద్భుతంగా నటించారు..దర్శకుడు కూడా అద్భుతమైన పని చేసారు. VFX అత్యున్నత స్థాయిలో ఉంది. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నెక్ట్స్ లెవ‌ల్ అని మ‌రొక నెటిజ‌న్ ప్ర‌శంసించారు.

తేజ స‌జ్జా- మ‌నోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్, జగపతి బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మంచి చెడుల మ‌ధ్య జ‌రిగే యుద్ధం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ సినిమాని అద్భుతంగా మలిచారని ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు ప్ర‌శంసిస్తున్నారు. తేజ స‌జ్జా సూప‌ర్ హీరోగా మ‌రోసారి మ‌రిపించాడు. అయితే ఈ సినిమాను హ‌నుమాన్ తో కొంద‌రు పోల్చి చూసినా, చాలా మంది ఇది ఫ్రెష్ గా ఉంద‌ని కీర్తించారు.