'ధురంధర్' అసలు సినిమానే కాదంట!
`ధురంధర్`.. ఇప్పుడు ఎవరిని కదిలించినా వినిపిస్తున్న పేరిది.రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వరల్డ్ వైడ్‌గా సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది.
By: Tupaki Entertainment Desk | 19 Dec 2025 3:36 PM IST`ధురంధర్`.. ఇప్పుడు ఎవరిని కదిలించినా వినిపిస్తున్న పేరిది.రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వరల్డ్ వైడ్‌గా సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. సైలెంట్‌గా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రతీ నోట హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.700 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచనంగా మారింది.
రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ఫీట్ లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్న ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. `ధురంధర్` అసలు సినిమానే కాదని కామెంట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా మేకింగ్‌పై మునుపెన్నడూ లేని విధంగా ఓ పెద్ద నోట్ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`ధురంధర్ సినిమా కాదు. భారతీయ సినిమాల్లో ఇతొక క్వాంటం లీప్. ఆదిత్యధర్ ఈ సినిమాతో ఉత్తర, దక్షిణ అనే తేడా లేకుండా భారతీయ సినిమా భవిష్యత్తును పూర్తిగా, ఏకపక్షంగా మార్చివేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే `ధురంధర్` ఒక సినిమా కాదు కాబట్టి. ధురంధర్ మూవీ సాధించింది భారీ స్కేల్‌ని మాత్రమే కాదు. ఇంతకు ముందెన్నడూ చూడని నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ని కంటికీ, మైండ్‌కు అందించింది. ఆదిత్యధర్ సన్నివేశాలను మాత్రమే డైరెక్ట్ చేయలేదు. ప్రేక్షకుల మైండ్‌ని కూడా చదివిని ఇంజనీర్ తను.
ఈ సినిమా మీ అటెన్షన్‌ని కోరదు.. కానీ కమాండ్ చేస్తుంది. ఫస్ట్ షాట్ నుంచే ఏదో మార్చలేనిది మొదలైందనే భావన కలిగిస్తుంది. ప్రేక్షకులు కూడా తెరపై జరిగే సంఘటనలతో మమేకమైపోయేలా చేసింది అంటూ `ధురంధర్`పై ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా సాంకేతికంగా ఈ సినిమా ప్రధాన స్రవంతి భారతీయ సినిమా పంథాని తిరిగి లిఖిస్తోందని, అంటే కాకుండా భారతీయ సినిమా సక్సెస్ సాధించడానికి తన స్థాయిని తగ్గించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
అలాగే ఇందు కోసం హాలీవుడ్‌ను గుడ్డిగా కాపీ కొట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. తన మూలాలలు నిరూపించుకుంటూనే అంతర్జాతీయ స్థాయిలో సినిమాటిక్‌గా ఉండగలదని దర్శకుడు ఆదిత్యధర్ ఈ సినిమాతో నిరూపించాడన్నారు. సినిమా చివరి ఎండ్ కార్డ్ పడుతున్నప్పుడు మీరు కేవలం వినోదాన్ని మాత్రమే పొందినట్టుగా మాత్రమే భావించరు. మీలో ఒక మార్పు వచ్చినట్టుగా భావిస్తారని, కేవలం సినిమాలు తీసే దర్శకుడికి ఇది సాధ్యం కాదు. మనలాంటి ఫిల్మ్ మేకర్స్ నిలబడిన పునాదిని పునర్మిస్తున్న దర్శకుడికే ఇది సాధ్యం` అంటూ దర్శకుడు ఆదిత్యధర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు వర్మ. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
