RGV -RRR.. హీటెక్కిన ఇంటర్వ్యూ.. ఏముందంటే?
"మాస్టర్ పీస్: ది ఆర్జీవీ -ఆర్ఆర్ఆర్ అని ఫిల్టర్డ్ " ఇంటర్వ్యూలో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. వర్మ మాట్లాడుతూ.."త్రిబుల్ ఆర్ వర్సెస్ ఆర్.. నేను సింగిల్ ఆర్.. మీరు త్రిబుల్ ఆర్" అంటూ వర్మ డైలాగ్ ట్రైలర్ ఆరంభించారు.
By: Madhu Reddy | 29 Sept 2025 8:09 PM ISTరామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈయన నిత్యం డేరింగ్ అండ్ డాషింగ్ మాటలతో తానేంటో నిరూపించుకున్నారు ముఖ్యంగా ఏం చెప్పినా ముక్కుసూటిగా చెప్పే వర్మ అంటే చాలా మందికి గౌరవం అనడంలో సందేహం లేదు అటు సినిమాల ద్వారా కూడా తాను చెప్పాల్సిన విషయాన్ని ముక్కుసూటిగా చెబుతూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అంతే కాదు అప్పుడప్పుడు ఈయన చేసే కామెంట్లు కాంట్రవర్సీకి దారి తీసి ఆఖరికి ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి.
ఇప్పుడు స్పాట్ టీవీ అంటూ మరో కొత్త ఛానల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందులో మాస్టర్ పీస్ అంటూ ఒక టాక్ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాంగోపాల్ వర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఇందులో ఉండి ఎమ్మెల్యే , డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విచ్చేశారు. ఆర్జీవీ -ఆర్ఆర్ఆర్ కలయికలో సాగిన ఈ ట్రైలర్ ఎపిసోడ్ పై ఆద్యంతం అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ఎన్నో విషయాలను వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అక్టోబర్ 2వ ఈ మాస్టర్ పీస్ ఫుల్ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు.
"మాస్టర్ పీస్: ది ఆర్జీవీ -ఆర్ఆర్ఆర్ అని ఫిల్టర్డ్ " ఇంటర్వ్యూలో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. వర్మ మాట్లాడుతూ.."త్రిబుల్ ఆర్ వర్సెస్ ఆర్.. నేను సింగిల్ ఆర్.. మీరు త్రిబుల్ ఆర్" అంటూ వర్మ డైలాగ్ ట్రైలర్ ఆరంభించారు. "రాము అంటేనే ఒక కాంట్రవర్సీ.. మీరు మరీ నిక్కచ్చితంగా మాట్లాడుతారు". అంటూ ఆర్ఆర్ఆర్ మాట్లాడిన మాటలకు వర్మ కౌంటర్ గా "మిమ్మల్ని ఎంత తోస్తే అంత ఎదురు తిరుగుతారు".. అంటూ వర్మ చేసిన కామెంట్లతో ఇద్దరి మధ్య రాజకీయ సంభాషణ మరింత హీటెక్కించేలా సాగింది. ఇందులో ఎన్నో విషయాలను వీరు చర్చించుకున్నారు? అటు సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇటు రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా చర్చించడం హైలైట్ గా మారింది.
ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీలు ఎక్కువగా టాక్ షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వారి గురించి పలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం లెజెండ్రీ పొలిటీషియన్స్ ను తన ఇంటర్వ్యూలకు పిలుస్తూ ఎన్నో విషయాలను బయటకు లాగి .. రాజకీయంగా కూడా వైరల్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఫుల్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేసింది. ఏది ఏమైనా వర్మ మరొకసారి సంచలనం సృష్టించబోతున్నారని చెప్పవచ్చు.
