Begin typing your search above and press return to search.

'దురంధ‌ర్ 2' సునామీని 'టాక్సిక్' త‌ట్టుకోలేదా?

ఆర్జీవీ ఇప్పుడు `దురంధ‌ర్` సీక్వెల్‌కి అనుకూలంగా, య‌ష్ `టాక్సిక్`కి అన‌నుకూలంగా మాట్లాడారు.

By:  Sivaji Kontham   |   1 Jan 2026 6:02 PM IST
దురంధ‌ర్ 2 సునామీని టాక్సిక్ త‌ట్టుకోలేదా?
X

ఏదైనా ఉన్న విష‌యాన్ని సూటిగా మాట్లాడేయ‌డం ఆర్జీవీ ప్ర‌త్యేక‌త‌. ``నువ్వు న‌చ్చావు లేదా న‌చ్చ‌లేదు!`` అనే విష‌యాన్ని కూడా నిజాయితీగా ముఖంపైనే చెప్పేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. అయితే ముఖ‌స్తుతి కోసం పాకులాడే స‌మాజంలో ఇలాంటి ముక్కుసూటి వ్య‌క్తి ఎదుర్కోవాల్సిన అన్నిటినీ ఎదుర్కొంటున్నాడు.

ఆర్జీవీ ఇప్పుడు `దురంధ‌ర్` సీక్వెల్‌కి అనుకూలంగా, య‌ష్ `టాక్సిక్`కి అన‌నుకూలంగా మాట్లాడారు. అది కేవ‌లం త‌న అభిప్రాయం మాత్ర‌మే అయినా, అత‌డు సూటిగా చెప్పేయ‌డం టాక్సిక్ టీమ్ హృద‌యాల‌ను గాయ‌ప‌రిచింది. ఇంత‌కీ అత‌డు ఏమ‌ని కామెంట్ చేసాడు? అంటే... ఉగాది కానుక‌గా వచ్చే మార్చిలో ఒకే రోజు రిలీజ్ కి వ‌స్తున్న దురంధ‌ర్ 2, టాక్సిక్... ఈ రెండిటిలో ఏది బెస్ట్ గా ఉంటుంది? అనేదానిపై త‌న అభిప్రాయం చెప్పారు. తాజా ట్వీట్‌లో `ధురంధర్ 2` దెబ్బనే `టాక్సిక్‌`గా ఉంటుందని వ్యాఖ్యానించారు. `ధురంధర్ 2` నుండి ఆశించే సునామీని యశ్ సినిమా తట్టుకోవడం కష్టమేనని ఆయన విశ్లేషించారు. అయితే దురంధ‌ర్ పై అభిమానం కొద్దీ ఆయ‌న అలా మాట్లాడారా? టాక్సిక్ లో కంటెంట్ అత‌డిని ఆక‌ట్టుకునే స్థాయిలో లేదా? .. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌నే జ‌వాబు ఇవ్వాల్సి ఉంది.

నిజానికి టాక్సిక్ సినిమా పోస్ట‌ర్లు, టీజర్ ఇప్ప‌టికే విడుద‌లై య‌ష్ ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకున్నాయి. కానీ ఆర్జీవీకి అవి క‌నెక్ట్ కాలేదా? టాక్సిక్ చిత్రం 19 మార్చి 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ధురంధర్- 2 (రివెంజ్ అండ్ డకాయిట్: ఎ లవ్ స్టోరీ)తో పోటీ పడుతూ.. ఉగాది పండుగ సందర్భంగా కన్నడ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ, మలయాళం సహా 6 భాషలలో విడుదల కానుంది. అయితే ఇంత భారీగా విడుద‌ల‌య్యే సినిమాకి నెగెటివ్ అభిప్రాయాలు ఇబ్బందిక‌ర‌మే. టాక్సిక్ విజువ‌ల్స్ చూడ‌గానే, ఇది కూడా రెగ్యుల‌ర్ గా వ‌చ్చే మ‌రో గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా అనే అభిప్రాయం క‌లగ‌డం వ‌ల్ల‌నే ఆర్జీవీ ఆలా స్పందించారా? అంటే.. దీనికి `టాక్సిక్` బృందం ధీటుగా జ‌వాబివ్వాల్సి ఉంటుంది. అదే స‌మ‌యంలో `దురంధ‌ర్ 2` వేవ్ ని కూడా టాక్సిక్ టీమ్ అర్థం చేసుకుని తెలివిగా రిలీజ్ తేదీని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. టాక్సిక్ కంటెంట్ దురంధ‌ర్ ని మించి అని య‌ష్ - గీతూ మోహ‌న్ దాస్(ద‌ర్శకురాలు) ఎలా నిరూపిస్తారు? ప్ర‌చార సామాగ్రిలా అలాంటి విష‌యం ఉంద‌ని ఎలా పుష్ చేయ‌గ‌ల‌రు? అన్న‌ది కూడా చాలా కీల‌క‌మైన‌ది. ఒక కామెంట్ వినిపించిన‌ప్పుడు కచ్ఛితంగా స‌రిదిద్దాల్సిన బాధ్య‌త య‌ష్ టీమ్ కి ఉంది.

కామెరూన్, స్పీల్ బ‌ర్గ్ కంటే గొప్ప‌వాడు అని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళిని పొగిడేసిన ఆర్జీవీ ఇంత‌కుముందు కేజీఎఫ్ 2 రిలీజైన‌ప్పుడు య‌ష్ భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ స్టార్ అంటూ కీర్తించారు. ఇప్పుడు య‌ష్ టాక్సిక్ కంటే, దురంధ‌ర్ 2 త‌న ఫేవ‌రెట్ అని ముక్కుసూటిగా చెప్పారు. అయితే ఇది కేవ‌లం ఆర్జీవీ వ్యక్తిగ‌త అభిప్రాయం లేదా అభిమానానికి సంబంధించిన‌ది. య‌ష్ టాక్సిక్ దురంధ‌ర్ కంటెంట్ ని మించి ఉండ‌ద‌ని ఇప్పుడే ఎలా నిర్ణ‌యించ‌గ‌లం?