Begin typing your search above and press return to search.

RGV ఎవ‌రికోస‌మో టాలీవుడ్‌ని కించ‌పరుస్తున్నాడా?

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద వైఖ‌రి ఇటీవ‌ల ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అత‌డు సౌత్ ని కించ‌ప‌రుస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

By:  Sivaji Kontham   |   25 Feb 2026 10:03 AM IST
RGV ఎవ‌రికోస‌మో టాలీవుడ్‌ని కించ‌పరుస్తున్నాడా?
X

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాస్ప‌ద వైఖ‌రి ఇటీవ‌ల ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అత‌డు సౌత్ ని కించ‌ప‌రుస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క‌న్న‌డ చిత్రం `టాక్సిక్` పై బాలీవుడ్ చిత్రం `దురంధ‌ర్ 2` ఆధిప‌త్యం చెలాయిస్తుంద‌ని అన్నాడు.. దురంధ‌ర్ 2 ముందు ఏదీ నిల‌బ‌డ‌ద‌ని క‌ల‌రింగ్ ఇస్తున్నాడు.. ఊహించ‌ని ఈ చ‌ర్య‌ల‌తో అత‌డు సౌత్ ని ముఖ్యంగా తెలుగు లేదా క‌న్న‌డిగుల‌ను త‌గ్గిస్తున్నాడా? సౌత్ మొత్తాన్ని కిందికి దించేయ‌డ‌మే అత‌డి ఉద్ధేశ‌మా? ఒక‌వేళ అత‌డి అంచ‌నాలు త‌ప్పు అని తేలితే పెద్ద మూల్యం చెల్లించాల్సి వ‌స్తుందేమో! అంటూ కొత్త డిబేట్ మొద‌లైంది. ఇష్యూ పూర్తి వివ‌రంలోకి వెళితే..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. తాజాగా రణవీర్ సింగ్ నటించిన `ధురందర్ 2` (ద‌రంధ‌ర్ 2 - ది రివెంజ్‌) సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన ట్వీట్లు టాలీవుడ్ స‌హా సౌత్ సినిమా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

ఫిబ్రవరి 22న ఆర్జీవీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో `ధురోక్సిక్` అనే పదాన్ని వాడుతూ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. మార్చి 19న విడుదల కానున్న `ధురందర్ 2`కన్నడ స్టార్ యాష్ నటిస్తున్న `టాక్సిక్` సినిమాల మధ్య పోటీని ఆయన విశ్లేషించారు. ధురందర్ 2 సినిమా ప్రేక్షకుల తెలివితేటలను గౌరవిస్తుందని, కానీ `టాక్సిక్` వంటి సినిమాలు (కేజీఎఫ్ వంటి మాస్ సినిమాలు) ప్రేక్షకులను తెలివితక్కువ వారిగా మూగ వారిగా భావిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే ఆర్జీవీ అక్క‌డితో ఆగిపోలేదు. `ధురందర్ 2`ను ఒక గ్రహశకలంతో పోల్చిన ఆయ‌న‌ ఈ సినిమా ప్రభావంతో చిత్ర పరిశ్రమలోని `డైనోసార్ యుగం` (పాతకాలపు మాస్ మసాలా సినిమాలు) ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు ఆయ‌న సౌత్ సినిమాపై సునిశిత విమర్శలు చేసారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాను ఏలుతున్న సౌత్ ఇండస్ట్రీ ఆధిపత్యాన్ని ఈ సినిమా తుడిచిపెట్టేస్తుందని ఆయన అనడం టాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించింది.

అయితే టాలీవుడ్ ని కించ‌ప‌రుస్తూ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక సెక్ష‌న్ విరుచుకుప‌డుతోంది. ఇది అత‌డి ఆజ్ఞానం అని తిట్టి పోస్తున్నారు. అత‌డు కేజీఎఫ్ వంటి సినిమాలను `లోకల్` అని, మాస్ ప్రేక్షకుల `అజ్ఞానాన్ని` వాడుకుని హిట్ అయ్యాయని అనడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదేమైనా పెయిడ్ ప్రమోషనా? అంటూ ఆర్జీవీపై కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వర్మ ఆకాశానికెత్తేయడం చూస్తుంటే ఇది కేవలం `పెయిడ్ ప్రమోషన్` అయి ఉంటుంద‌ని కొందరు అనుమానిస్తున్నారు.

సౌత్ సత్తాను తక్కువ చేసి మాట్లాడ‌టం ఆర్జీవీ తెలివిత‌క్కువ‌త‌నం అని కొంద‌రు నెటిజ‌నులు విమ‌ర్శిస్తున్నారు. మునుముందు విడుద‌ల‌కు రాబోతున్న తెలుగు సినిమాలు కల్కి 2898 ఏడి- 2, స్పిరిట్, ఎన్టీఆర్-నీల్ సినిమా ఇవన్నీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాయని తెలిసి కూడా వర్మ ఇలా అనడం వెనుక బాలీవుడ్ పై ఆయనకున్న మమకారం ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒక‌వేళ దురంధ‌ర్ 2 చిత్రం టాక్సిక్ పై పైచేయి సాధించి ఉండొచ్చు... కన్న‌డ సినిమా ఓడిపోవ‌చ్చు. కానీ సౌత్ ని గెలిపించేందుకు టాలీవుడ్ నుంచి వ‌స్తున్న భారీ చిత్రాల వివ‌రాల‌ను వ‌ర్మ ప‌రిశీలించాల్సింది! అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

వర్మ విశ్లేష‌ణ‌లు ఎలా ఉన్నా కానీ, తన అంచనాలు తప్పితే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది! అని విమ‌ర్శ‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే `టాక్సిక్` సినిమాపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 19న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఏది నిలుస్తుందో తేలిపోతుంది.