Begin typing your search above and press return to search.

అమితాబ్‌ గురించి కంటే ఊర్మిళ గురించే ఎక్కువ....!

విలక్షణ దర్శకుడు అంటూ కెరీర్ ఆరంభంలో పేరు సొంతం చేసుకున్న రామ్‌ గోపాల్‌ వర్మ, కాల క్రమేనా వివాదాల దర్శకుడిగా పేరు పడ్డాడు.

By:  Ramesh Palla   |   6 Dec 2025 3:00 PM IST
అమితాబ్‌ గురించి కంటే ఊర్మిళ గురించే ఎక్కువ....!
X

విలక్షణ దర్శకుడు అంటూ కెరీర్ ఆరంభంలో పేరు సొంతం చేసుకున్న రామ్‌ గోపాల్‌ వర్మ, కాల క్రమేనా వివాదాల దర్శకుడిగా పేరు పడ్డాడు. ఆయన మాట్లాడితే వివాదం, మాట్లాడాలి అంటే వివాదం ఉండాల్సిందే. అలాంటి వర్మ గురించి గత మూడు దశాబ్దాలుగా ఏవో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన గురించి ప్రముఖంగా వినిపించే పుకారు ఒకటి ఉంది. అదే వర్మ కు హీరోయిన్‌ ఊర్మిళ మంటోడ్కర్‌ అంటే ప్రేమ, ఆ ప్రేమ కారణంగానే ఆమెతో వరుస సినిమాలు చేశాడు. ఇద్దరి మధ్య ఒకానొక సమయంలో ప్రేమ వ్యవహారం సాగింది అనేది ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉండటంతో ఆ పుకార్లు రావడం లేదు, కానీ ఒకప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంది అని మాత్రం ఇప్పటికీ చాలా మంది ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుతూనే ఉంటారు.

హీరోయిన్‌ ఊర్మిళ తో ప్రేమాయణం...

హీరోయిన్‌ ఊర్మిళతో తనకు ఉన్న రిలేషన్‌, ఆమెతో ఉండే బాండింగ్ గురించి మీడియాలో వచ్చే పుకార్లపై దర్శకుడు వర్మ గతంలో పెద్దగా స్పందించలేదు. ఒకవేళ ఆ ప్రశ్న వచ్చినా కూడా అనుకుంటే అనుకున్నారు అన్నట్లుగా లైట్‌ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు వర్మ ఆ విషయాన్ని కాస్త సీరియస్‌గానే ఖండించాడు. రామ్‌ గోపాల్‌ వర్మ సాధారణంగా పుకార్లు వస్తే పెద్దగా పట్టించుకోడు అనే విషయం తెల్సిందే. అందుకే ఇన్నాళ్లు అయినా ఆ పుకార్ల గురించి పెద్దగా స్పందించకుండా ఉన్నాడు. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికి అయినా ఆ విషయం గురించి ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి అనే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చినట్లుగా మాట్లాడాడు. ఈ సమయంలో ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు అన్నట్లుగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడంతో ఇకపై అలాంటి పుకార్లు రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ...

జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్మిళ గురించి వర్మ మాట్లాడుతూ... ఆమె మల్టీ ట్యాలెంటెడ్‌ నటి, ఆమెతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడంకు కారణం ఆమె ప్రతిభ మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. ఎక్కువ సినిమాలు చేసినంత మాత్రాన ఏదో అన్నట్టు కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఊర్మిళతో కంటే నేను ఎక్కువగా అమితాబ్‌ బచ్చన్ తో సినిమాలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ చాలా మంది ఊర్మిళ తో నేను చేసిన సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు అని వర్మ అన్నాడు. ఎదుటి వ్యక్తి ప్రతిభావంతులు అయినప్పుడు ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటాం. వారితో కంఫర్ట్‌ ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలకు వర్క్‌ చేయాలని అనుకుంటాం. ఆమె ప్రతిభావంతురాలు కావున ఆమెతో సినిమాలు ఎక్కువ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వర్మ చెప్పుకొచ్చాడు.

శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా...

వర్మ, ఊర్మిళ కాంబినేషన్‌లో రంగీలా, దౌడ్‌, సత్య మొదలగు సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరూ ఆ సమయంలో ఎక్కువగా సన్నిహిత్యంగా ఉంటూ కనిపించే వారని అంటారు. అందుకే వీరి గురించి పుకార్లు ప్రముఖంగా రావడం మనం చూస్తూ వచ్చాం. కానీ వర్మ మాత్రం ఆమె ప్రతిభావంతురాలు కావడం వల్లే ఎక్కువ సినిమాలు ఆమెతో చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇకపై అయినా ఈ పుకార్లకు చెక్‌ పడుతుందేమో చూడాలి. వర్మ ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయ్యాడు. ఆ మధ్య రాజకీయ పరమైన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలవడంతో పాటు వివాదాల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఆయన మొదటి సినిమా శివ రీ రిలీజ్ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌ మే భూత్‌ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.