హే సందీప్ నువ్వు పార్క్‌లో 'యానిమల్' లాగా..
కాప్ యాక్షన్ డ్రామా `స్పిరిట్` కోసం ప్రభాస్ ప్రిపరేషన్ లో ఉన్నాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు.
By: Sivaji Kontham | 26 Dec 2025 12:22 AM ISTక్రిస్మస్ డే.. సందీప్ రెడ్డి వంగా తన 44వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ నుంచి వివేక్ ఒబెరాయ్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సందీప్ రెడ్డి మోస్ట్ అవైటెడ్ చిత్రాలైన ``యానిమల్ పార్క్`` , ``స్పిరిట్`` గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా అభిమానుల నుంచి సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతలోనే సందీప్ రెడ్డి వంగాకు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.సందీప్ వంగా.. నీకు ఒక వక్రీకృత, అసాధారణమైన పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ ఆశ్చర్యపరిచాడు. ఆర్జీవీ ఎంతో ఫన్నీగా అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
యానిమల్ పార్క్ .. స్పిరిట్.. రెండింటి నుండి ఇతివృత్తాలను తన కోరికలో చేర్చాడు. దర్శకుడి స్పెషల్ డేని బోల్డ్ గా క్రియేటివ్ గా సెలబ్రేట్ చేసాడు. ``హే .. వంగా సందీప్ ... నువ్వు పార్క్ లో ఒక యానిమల్ లాగా నీ పుట్టినరోజు జరుపుకుంటున్నావని ఆశిస్తున్నాను... నీ దర్శకత్వ స్ఫూర్తికి చాలా చాలా సంతోషాలు`` అని ఆర్జీవీ రాసాడు. .
కాప్ యాక్షన్ డ్రామా `స్పిరిట్` కోసం ప్రభాస్ ప్రిపరేషన్ లో ఉన్నాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ బర్త్ డే సందర్భంగా రెబెల్ స్టార్ ఓ సినిమా సెట్స్ నుండి తెరవెనుక ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటో సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. దానిని తన ఇన్‌స్టా లో పోస్ట్ చేసిన ప్రభాస్ ``పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రో... నువ్వు ఏమి సృష్టిస్తున్నావో అందరూ చూసే వరకు వేచి ఉండలేను`` అని రాశాడు.
సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్పిరిట్ కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ తో పాటు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.ఈ కాప్ డ్రామా 2027లో విడుదల అవుతుందని పుకార్లు వినిపిన్నాయి. యానిమల్ పార్క్, స్పిరిట్ తర్వాత సందీప్ వంగా అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేసేందుకు అవకాశం ఉంది.
