Begin typing your search above and press return to search.

రాంగోపాల్ వ‌ర్మ‌ని దెయ్యాలు భ‌య‌పెట్టిన వేళ‌!

హార‌ర్ చిత్రాలకు కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా `భూత్` సినిమాతో ప్రేక్షకులకు కలలో కూడా భయం కలిగించే అనుభూతిని అందించారు.

By:  Srikanth Kontham   |   9 July 2026 4:03 PM IST
రాంగోపాల్ వ‌ర్మ‌ని దెయ్యాలు భ‌య‌పెట్టిన వేళ‌!
X

హార‌ర్ చిత్రాలకు కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా `భూత్` సినిమాతో ప్రేక్షకులకు కలలో కూడా భయం కలిగించే అనుభూతిని అందించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో స్వయంగా వర్మకే ఓ వింత అనుభవం ఎదురైందని.. దాన్ని ఆయన ఇప్పటికీ ఓ మిస్టరీగా భావిస్తుంటారని తెలిసింది. ఆ రాత్రి జరిగిన సంఘటన వ‌ర్మ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. షూటింగ్ పనులన్నీ ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో వర్మ తన గదికి చేరుకున్నారు.

అలసిపోయి ఉన్నా? నిద్రపోయే ముందు ప్రెష్ అప్ అయ్యి మంచం మీద సేదతీరడానికి సిద్ధమయ్యారు. అప్పుడే ఆయనకు వింతగా అనిపించింది. ఏదో ఒక అస్పష్టమైన స్వరంతో తన పేరును ఎవరో? పిలుస్తున్నట్లు అనిపించింది. తనను గదిలో ఉన్న వ్యక్తి పిలిచినట్లు స్పష్టంగా వినిపించింది. గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వ‌స్తోన్న‌ ఆ పిలుపుతో వర్మ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఎవరైనా? తనను ఉద్దేశించి పిలుస్తున్నారేమోనని? గది అంతా చూసారు. ఆ సమయంలో గదిలో తాను తప్ప మరెవరూ లేరని వ‌ర్మ‌కు తెలుసు.

పిలిచిన వారికి సమాధానం ఇచ్చేందుకు వ‌ర్మ తలుపుల వైపు, గది మూలల వైపు వెతికినా ఫలితం లేకపోయింది. అక్కడ గాలి తప్ప మరొకటి ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. అంతేకాదు వర్మ కూడా తన వంతుగా పిలిచిన వారికి తిరిగి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. `ఎవరు?` అని గట్టిగా వ‌ర్మ‌ అడిగినా? ఆ గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం రాజ్యమేలింది. తనను పిలిచిన వ్యక్తి గానీ, లేదా మరొక శబ్దమా అనేది అర్థం కాక వ‌ర్మ అయోమయానికి గురయ్యారు. ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యంతో ఆ రాత్రి నిద్ర పట్టక వ‌ర్మ ఇబ్బంది పడ్డారు.

ఈ సంఘటన వర్మ ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో `భూత్` సినిమా కోసం వ‌ర్మ ఎంతో లోతైన పరిశోధన చేసి భయం అంటే ఎలా ఉంటుందో తెరపై చూపించారు. కానీ తనకు ఎదురైన ఆ వింత అనుభవం మాత్రం ఏ సైన్స్ లేదా తర్కానికి అందని చిక్కుముడిగానే ఉండిపోయింది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు దెయ్యాల మీద చేసిన ప్రయోగాలు, తనకే ఎదురవ్వడం విచిత్రమైన అనుకోని పరిణామం.

ఇలాంటి సంఘటనలు మనిషికి అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. వర్మ వంటి హేతువాది, దర్శకుడు సైతం ఆ రాత్రి తనను పిలిచిన ఆ స్వరం గురించి ఇప్పటికీ వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఇది భ్రమా? లేక? మరొకటా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన మాత్రం ఇప్పటికీ వ‌ర్మ భయానక అనుభవాల్లో ఒకటిగా నిలిచిపోయింది.